అల్లం వంటింట్లో తరచుగా ఉపయోగించే ముఖ్యమైన మసాలా దినుసు. వంటలకు ప్రత్యేక రుచి, సువాసన ఇవ్వడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరచడం, వికారం తగ్గించడం, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
సులభంగా వెంట తీసుకెళ్లి, ఎక్కువ కాలం నిల్వ ఉంచుకునే క్యాండీ రూపంలో అల్లం ప్రయోజనాలను ఈజీగా పొందవచ్చు.
అల్లం క్యాండీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రుచికరంగా ఉండటమే కాకుండా జీర్ణక్రియకు కూడా ఇది సహాయపడుతుంది.
తాజా అల్లాన్ని శుభ్రంగా కడిగి తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత వాటిని నీటిలో ఉడికించి మెత్తగా చేసుకోవాలి.
ఉడికించిన అల్లం ముక్కలను వడకట్టి పక్కన పెట్టాలి. అల్లం రుచి తగ్గకుండా ఉండేందుకు ఉడికించిన నీటిని కూడా కొంతమంది ఉపయోగిస్తారు.
ఒక పాత్రలో చక్కెర వేసి కొద్దిగా నీరు కలిపి పాకం తయారు చేయాలి. పాకం సరైన చిక్కదనం వచ్చిన తర్వాత అల్లం ముక్కలను అందులో వేయాలి.
అల్లం ముక్కలు పాకాన్ని బాగా పీల్చుకునే వరకు మెల్లగా కలుపుతూ ఉడికించాలి. దీంతో క్యాండీకి మంచి రుచి వస్తుంది.
పాకం పూర్తిగా అల్లానికి పట్టిన తర్వాత ముక్కలను బయటకు తీసి ఒక ప్లేట్లో విడివిడిగా పరచాలి. అవి చల్లారే వరకు అలాగే ఉంచాలి.
చల్లారిన తర్వాత వాటిపై కొద్దిగా చక్కెర పొడి చల్లితే క్యాండీలు అతుక్కోకుండా ఉంటాయి. అలాగే చూడటానికి కూడా ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
అల్లం క్యాండీని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేస్తే చాలా రోజుల పాటు తాజాగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా దీనిని వెంట తీసుకెళ్లవచ్చు.
వికారం, అజీర్ణం, గొంతు అసౌకర్యం వంటి చిన్న సమస్యల సమయంలో అల్లం క్యాండీ ఉపయోగపడుతుంది.