జూన్ 20న ‘మాటా’ ఆధ్వర్యంలో వివాహ పరిచయ వేదిక
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) నిర్వహిస్తున్న రెండో మహాసభల (MATA 2nd Convention ’26) సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారి కోసం ప్రత్యేకంగా మాటా మాట్రిమోనీ – వివాహ పరిచయ వేదిక’ను ఏర్పాటు చేశారు. జూన్ 20, 2026న ఉదయం 10:00 గంటలకు పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది.
కార్యక్రమ వివరాలు..
అమెరికాలో నివసిస్తున్న అన్ని రకాల వీసా హోల్డర్లు , పౌరసత్వం కలిగిన వధూవరులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.
అంతర్జాతీయ స్థాయిలో ధృవీకరించబడిన ప్రొఫైల్స్ (Verified Global Profiles) ఈ వేదికపై అందుబాటులో ఉంటాయి.
మన సంస్కృతి, సంప్రదాయాలు , కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిస్తూ ఈ మ్యాచ్ మేకింగ్ నిర్వహించనున్నారు.
కన్వెన్షన్‌కు హాజరయ్యే వారికి ఈ వివాహ పరిచయ వేదికలో రిజిస్ట్రేషన్ ఉచితం.
వేదిక , సమయం..
- తేదీ: జూన్ 20, 2026.
- సమయం: ఉదయం 10:00 AM.
- వేదిక: ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్, 100 స్టేషన్ ఏవ్, ఓక్స్, PA 19456.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల వారు https://tinyurl.com/2026mata-matrimony లింక్ ద్వారా లేదా పోస్టర్‌పై ఉన్న QR కోడ్‌ను స్కాన్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు.
నిర్వహకులు..
ఈ కార్యక్రమాన్ని మాట్రిమోనీ కమిటీ చైర్ అరుంధతి షేకెల్లి, కో-చైర్స్ సురేష్ కుమార్ తాండ, లత మదిశెట్టి , ఇతర సభ్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు MATA హెల్ప్ లైన్ నంబర్లు +1 888-7MATAUS, +1 (888) 762-8287ను సంప్రదించవచ్చు.








