విజయ్ సినిమాకు నాని క్లాప్
హాయ్ నాన్న(hi nanna) సినిమాతో తొలి ప్రయత్నంలోనే ఎమోషనల్ కథనం ద్వారా గుర్తింపు పొందిన దర్శకుడు శౌర్యువ్(Shouryuv), ఇప్పుడు తన రెండో ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తున్నారు. ఈసారి ఆయన హీరోగా విజయ్ దేవరకొండ(Vijay devarakonda)ను ఎంపిక చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది. హాయ్ నాన్నని నిర్మించిన వైరా ఎంటర్టైన్మెంట్స్(Vyra entertainments) ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది. ఇటీవల అధికారిక ప్రకటన వెలువడగా, ఈ రోజు గ్రాండ్‌గా పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌కు స్పెషల్ గెస్ట్‌గా నేచురల్ స్టార్ నాని(nani) హాజరవడం ప్రాజెక్ట్‌పై మరింత హైప్‌ను తీసుకొచ్చింది.
లాంచ్ ఈవెంట్లో నాని క్లాప్ కొట్టి విజయ్ దేవరకొండపై మొదటి షాట్‌ను ప్రారంభించడం విశేషం. ఇద్దరు స్టార్స్ ఒకే వేదికపై కనిపించడంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ తన కమిట్మెంట్స్ పూర్తి చేసిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా, ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. కథ, పాత్రల రూపకల్పనపై డైరెక్టర్ శౌర్యువ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టుతున్నట్లు సమాచారం.
ఇంకా టైటిల్ ఫైనల్ కాలేని ఈ సినిమాకు సంగీతాన్ని హేషం అబ్దుల్ వాహబ్(Hesham abdhul Wahab) అందించనున్నారు. హాయ్ నాన్న లో తన మెలోడియస్ స్కోర్‌తో ఆకట్టుకున్న హేషమ్, ఈ సినిమాకి కూడా హైలైట్ అవుతారని చిత్ర వర్గాలు భావిస్తున్నాయి. హీరోయిన్ ఎంపికపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే, శౌర్యువ్-విజయ్ కాంబినేషన్‌తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్లో క్రేజీ వెంచర్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి








