Thimmarajupalli TV: ఈ నెల 17న ఓవర్సీస్ లో రిలీజ్ కాబోతున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“తిమ్మరాజుపల్లి టీవీ” సినిమాను ఓవర్సీస్ లో శ్లోక ఎంటర్ టైన్ మెంట్స్, వైబ్రెంట్ మూవీస్ రిలీజ్ చేయబోతున్నాయి. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను ఓవర్సీస్ ప్రేక్షకులకు అందించిన ఈ రెండు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు “తిమ్మరాజుపల్లి టీవీ” కంటెంట్ పై పూర్తి నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ కు ముందుకొచ్చాయి. ప్రమోషనల్ కంటెంట్ తో “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి








