సమ్మర్ రేస్ నుంచి స్వయంభు అవుట్? ఐపీఎల్ ఎఫెక్ట్ షాకింగ్!
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(Nikhil Siddhartha) తన కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్న స్వయంభు(Swayambhu) ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పీరియాడిక్ యాక్షన్ సాగాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఒక యోధుడి కథను చూపించనున్నారని సమాచారం. నిఖిల్ మార్కెట్‌ను మించిపోయే స్థాయిలో ఈ సినిమాపై ఖర్చు పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. విడుదలైన టీజర్ మంచి స్పందన తెచ్చుకోగా, ఫస్ట్ సాంగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్(Netflix) భారీ ధరకు సొంతం చేసుకోవడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఇవి కూడా చదవండి
ఇంతటి బజ్ ఉన్నప్పటికీ, సినిమా రిలీజ్ డేట్‌పై మాత్రం మేకర్స్ ఇంకా స్పష్టత ఇవ్వకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సమ్మర్లో రిలీజ్ అవుతుందనే ప్రచారం బలంగా ఉన్నప్పటికీ, అధికారిక ప్రకటన రాలేదు. ఐపీఎల్(IPL) సీజన్ మే నెలలో ఉండటంతో థియేట్రికల్ కలెక్షన్స్‌పై ప్రభావం పడుతుందనే ఆలోచనతో రిలీజ్‌ను వాయిదా వేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ సినిమాకు భరత్ కృష్ణమాచారి(Bharat Krishnamachari) దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్లుగా సంయుక్త మీనన్(Samyuktha Menon), నభా నటేష్(Nabha Natesh) నటిస్తున్నారు. టాప్ టెక్నీషియన్లు అయిన సెంథిల్ కుమార్(Senthil Kumar) సినిమాటోగ్రఫీ అందించగా, రవి బస్రూర్(Ravi Basrur) సంగీతం సమకూర్చారు. నిర్మాతలుగా భువన్(bhuvan), శ్రీకర్(srikar) వ్యవహరిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం థియేట్రికల్ డీల్స్ ఫైనల్ చేసే దశలో ఉంది. భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న స్వయంభు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.








