Swayambhu: స్వయంభుకు క్రేజీ ఓటీటీ డీల్
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్(nikhil siddharth) ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా స్వయంభు(swayambhu)పై సినీ వర్గాల్లో రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. దర్శకుడు భరత్ కృష్ణమాచారి(bharath krishnamachari) ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా స్థాయిలో భారీ విజువల్ ట్రీట్‌గా రూపొందుతోంది. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ, భారీ నిర్మాణ విలువలు, టెక్నికల్ టీమ్ ఇవన్నీ కలిసి ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో మంచి క్రేజ్‌ను తీసుకువచ్చాయి. విడుదలకు ముందే ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్‌పై తాజాగా ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫార్మ్ నెట్ ఫ్లిక్స్(netflix) స్వయంభు డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందం సాధారణ విధానంలో కాకుండా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోడల్లో కుదిరినట్లు తెలుస్తోంది. థియేటర్లలో ఈ సినిమా సాధించే నెట్ కలెక్షన్లలో 50% మొత్తాన్ని నెట్‌ఫ్లిక్స్ చెల్లించనుండటం విశేషం. అంటే, బాక్సాఫీస్ వద్ద సినిమా రన్ ఎంత బలంగా ఉంటే, ఓటీటీ డీల్ విలువ కూడా అంతగా పెరుగుతుందన్నమాట. ఈ కొత్త ట్రెండ్ టాలీవుడ్లో మరిన్ని సినిమాలకు మార్గదర్శకంగా మారే అవకాశముంది.
పిక్సెల్ స్టూడియోస్(pixel studios) నిర్మిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్(samuuktha menon), నభా నటేష్(nabha nayesh) హీరోయిన్లుగా నటిస్తుండగా, సంగీతాన్ని రవి బస్రూర్(ravi basrur) అందిస్తున్నారు. విజువల్స్‌కు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్(KK senthil kumar) తన ప్రతిభను చాటనున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మొత్తం మీద స్వయంభు టాలీవుడ్లో కొత్త బిజినెస్ మోడల్‌కు నాంది పలికే ప్రాజెక్ట్‌గా నిలవనుంది.








