తలైవర్173కి రూట్ క్లియర్
తమిళ సినీ పరిశ్రమలో భారీ అంచనాలను రేకెత్తిస్తున్న తలైవర్173(Thalavair173) ప్రాజెక్ట్ మరో కీలక మలుపు తీసుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాను, లెజెండరీ నటుడు కమల్ హాసన్(Kamal Haasan) తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్(Raajkamal Films International) బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే ఈ సినిమా కోలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా మారింది. మొదట డైరెక్టర్ గా ఎంపికైన సుందర్ సి తప్పుకోవడంతో, తరువాత సిబి చక్రవర్తి(Cibi Chakravarthi)ని ఎంపిక చేశారు. అయితే ఆయన కూడా అనూహ్యంగా ప్రాజెక్ట్ నుంచి బయటకు రావడంతో, సరైన డైరెక్టర్ కోసం టీమ్ తీవ్రంగా వెతికింది.
ఈ క్రమంలో తాజాగా యంగ్ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు(Ashwath Marimuthu) పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. డ్రాగన్(Dragon) తరువాత AGS ఎంటర్టైన్మెంట్ తో కమిట్మెంట్లో ఉన్న అశ్వత్‌ను, రజినీకాంత్ ప్రత్యేకంగా కోరడంతో ఆ సంస్థ NOC జారీ చేసి ఈ ప్రాజెక్ట్‌కు మార్గం సుగమం చేసింది. అశ్వత్ ఇప్పటికే రజినీకాంత్‌కు ఒక కమర్షియల్ స్క్రిప్ట్ వినిపించగా, ఆయన నుంచి ప్రాథమిక ఆమోదం లభించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ ఫైనల్ స్క్రిప్ట్ వర్క్స్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు.
షూటింగ్ జూలై నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్న ఈ సినిమా, వేగంగా పూర్తయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాను సంక్రాంతి 2027 సందర్భంగా రిలీజ్ చేయాలని నిర్మాతలు టార్గెట్ గా పెట్టుకున్నారు. రజినీకాంత్- కమల్ హాసన్ కలయిక, అశ్వత్ మారిముత్తు దర్శకత్వం.. ఈ మూడు అంశాలు కలిసివచ్చి తలైవర్173ను పాన్ ఇండియా లెవల్లో భారీ హైప్ కలిగిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటనలు రాబోయే రోజుల్లో మరింత స్పష్టతనివ్వనున్నాయి.








