Divi: అంతమందిలో కూడా నీఛంగా ప్రవర్తించాడు
బిగ్ బాస్(bigg boss) రియాలిటీ షో తో మంచి క్రేజ్ సంపాదించుకున్న దివి(Divi) ఇటీవలే హనీ(honey) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నవీన్ చంద్ర(naveen chandra) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ లో దివి చాలా యాక్టివ్ గా పాల్గొంది. ప్రమోషన్స్ లో భాగంగా తాను కొన్ని తెలియని విషయాలను బయటపెట్టగా అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రీసెంట్ గా తాను ఒక పబ్ ఈవెంట్ కు వెళ్లానని అక్కడ తన చుట్టూ బాడీ గార్డ్స్ ఉన్నప్పటికీ మధ్యలోనుంచి ఒకడు వచ్చి తన నడుమును గిల్లాడని, అంతేకాకుండా మళ్లీ అక్కడికి వచ్చి ఏమీ తెలియనట్టు నిల్చుని తనను చూస్తున్నాడని చెప్పింది. అలా చేయడంతో తనకు బాగా కోపం వచ్చిందని, వెంటనే సీరియస్ గా చూసి తలపై గట్టిగా కొట్టి బాడకవ్ అని తిట్టి వెళ్లినట్టు చెప్పింది దివి.
ఒకవేళ తాను అలా చేయకపోతే తర్వాత బ్యాడ్ గా ఫీలవుతానని, తన తప్పు కానప్పుడు తాను రియాక్ట్ అవాల్సిందేనని, అంత మంది ఉన్నప్పటికీ వాడు చాలా నీఛంగా ప్రవర్తించాడని, అప్పటివరకు ఫ్రీ గా నడిచిన తాను, అది జరిగిన తర్వాత జాగ్రత్తగా చేతులు దగ్గరికి పెట్టుకుని నడిచానని, ఆ ఇన్సిడెంట్ తనకు చాలా షాకింగ్ గా అనిపించిందని దివి చెప్పింది.













