మే 16న ‘టాస్క్’ ఆధ్వర్యంలో ఆన్లైన్ చెస్ పోటీలు
TASC: దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం (TASC) ఆధ్వర్యంలో తెలుగు విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టేందుకు మే 16న భారీ ఆన్లైన్ చెస్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ‘చెస్ క్లబ్’ సహకారంతో నిర్వహిస్తున్న ఈ పోటీలు విద్యార్థులలో వ్యూహాత్మక ఆలోచనలను పెంపొందించేందుకు ఒక చక్కని వేదిక.
పోటీల వివరాలు..
ఈ టోర్నమెంట్ను విద్యార్థుల వయస్సు, తరగతులకు అనుగుణంగా ఐదు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. కిండర్ గార్డెన్ నుంచి మొదలుకొని, ప్రైమరీ (1-3 గ్రేడ్), ఎలిమెంటరీ (4-5 గ్రేడ్), మిడిల్ స్కూల్ (6-8 గ్రేడ్), మరియు హై స్కూల్ (9-12 గ్రేడ్) విద్యార్థులు తమ తమ విభాగాల్లో పోటీ పడవచ్చు.
మే 15 రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరి తేదీ.
రిజిస్ట్రేషన్ లింక్: https://online.chessklub.com/tasc
కార్యవర్గ బృందం..
ఈ పోటీల నిర్వహణలో అధ్యక్షులు కొండలరావు వయినేని, సెక్రటరీ శంకర్ సింగం శెట్టి, ట్రెజరర్ మహేష్ నూకల కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రెసిడెంట్ ఎలక్ట్ వేణు రెడ్డి కట్కూరి, పాస్ట్ ప్రెసిడెంట్ సీతారాం పామిరెడ్డి, కార్యవర్గ సభ్యులు ప్రసూన బసాని, మహేష్ కపాదం, సైదులు కొలసాని, తదితరులు ఈ టోర్నమెంట్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మరింత సమాచారం కోసం వెంకట్ పెయ్యాల (310-427-0335) లేదా విష్ణు కలవకురు (949-307-1150)లను సంప్రదించగలరు.
ఇవి కూడా చదవండి








