గ్లోబల్ తెలంగాణ సంఘం ‘రాలీ’ చాప్టర్ నూతన కార్యవర్గం ప్రకటన!
GTA: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలను ఏకం చేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న గ్లోబల్ తెలంగాణ సంఘం (GTA), అమెరికాలోని రాలి (Raleigh) చాప్టర్ కోసం నూతన కార్యవర్గాన్ని (Executive Committee) ప్రకటించింది. సంస్థ గ్లోబల్ లీడర్షిప్ మార్గదర్శకత్వంలో ఈ కొత్త టీమ్ బాధ్యతలు స్వీకరించింది.
GTA గ్లోబల్ టీమ్..
సంస్థ గ్లోబల్ విభాగంలో వ్యవస్థాపకులు, అడ్వైజరీ చైర్‌గా కలవల విశ్వేశ్వర్ , చైర్మన్‌గా ప్రవీణ్ కేసిరెడ్డి, అధ్యక్షులుగా బాపురెడ్డి కేతిరెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్ట్‌గా రవీందర్ గడ్డంపల్లి వ్యవహరిస్తున్నారు.
GTA రాలీ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC)..
రాలీ చాప్టర్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు నియమితులైన సభ్యుల వివరాలు ఇవే..
- అధ్యక్షులు (President/PR): శ్రీనివాస్ నాగనబోయిన
- ప్రెసిడెంట్ ఎలక్ట్ (Membership): రజనీకర్ దాసరి
- ప్రధాన కార్యదర్శి: రామ్ సుశీల్ పాడూరి
- కోశాధికారి: శ్రీనాథ్ అమిరెడ్డి
- జాయింట్ సెక్రటరీ (Sports): వినయ్ చెరుకు
- మహిళా/NextGen: చైతన్య కొల్లూరి
- మీడియా/కమ్యూనికేషన్స్: రజిత కోట
- ఫుడ్ కమిటీ చైర్: మహిపాల్ అల్లూరి
- కల్చరల్/ఈవెంట్స్: ప్రియాంక ఏటికాల, అనిత మావురాపు
- లాజిస్టిక్స్: ఉదయ్ కాంత్ మదిక
- అడ్వైజర్: శేఖర్ నల్లబోతుల
తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను మరింతగా రాలి ప్రాంతంలో ప్రచారం చేస్తూ, స్థానిక తెలంగాణ కమ్యూనిటీకి అండగా నిలుస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలకు www.gtaraleigh.org లేదా www.globaltelangana.org వెబ్సైట్లను సందర్శించవచ్చు.








