సాన్ రామోన్లో ‘యాదాద్రి హిల్స్’ గ్రాండ్ లాంచ్!
A HUB GLOBAL LLC : అమెరికాలోని సాన్ రామోన్ వేదికగా A HUB GLOBAL LLC నిర్వహించిన ఇన్వెస్టర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా ముగిసింది. సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “యాదాద్రి హిల్స్ – ఎయిర్పోర్ట్ ఆధారిత మాడ్యులర్ టౌన్షిప్” , ఈస్ట్ బే ప్రాంతంలో (సాన్ రామోన్ & డబ్లిన్) త్వరలో ప్రారంభం కానున్న “A HUB EVENT CENTER” విశేషాలకు ఈ వేదిక సాక్ష్యంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి బే ఏరియా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో పెట్టుబడిదారులు, ఐటీ నిపుణులు , వ్యాపారవేత్తలు తరలివచ్చారు.
ముఖ్య అతిథిగా శ్రీ ఐలేని జయరాం రెడ్డి ..
ప్రముఖ పారిశ్రామికవేత్త, భూస్వామి శ్రీ ఐలేని జయరాం రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ప్రాజెక్ట్ విశిష్టతను వివరించారు. ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 500 ఎకరాల భూమిని కేటాయించిన ఆయన, 2025 అక్టోబర్‌లోనే A HUB GLOBAL వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస మణప్రగడ గారితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “తూర్పు హైదరాబాద్ ట్రయాంగిల్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలనే విజన్‌కు నా పూర్తి మద్దతు ఉంటుంది. తెలంగాణలో మొట్టమొదటి భారీ ఎయిరోట్రోపోలిస్ ఆధారిత టౌన్‌షిప్‌గా ఇది చరిత్ర సృష్టించబోతోంది,” అని ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీనివాస మణప్రగడ మాట్లాడుతూ..
A HUB GLOBAL అధ్యక్షుడు శ్రీనివాస మణప్రగడ మాట్లాడుతూ, కేవలం ప్రాజెక్టులు నిర్మించడమే కాకుండా, ఒక బలమైన కమ్యూనిటీ ఆధారిత వ్యవస్థను (Ecosystem) నిర్మించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. గత 25 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న తాను, ఇప్పుడు తన అనుభవంతో భారత్ , అమెరికా దేశాలకు సేవ చేస్తూ, నూతన అవకాశాలను సృష్టించాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ప్రాజెక్ట్ హైలైట్స్ – యాదాద్రి హిల్స్..
వ్యూహాత్మకమైన అభివృద్ధి ప్రణాళికతో రూపొందుతున్న ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణలు ఇవే:
- గరుడ మినీ ప్రైవేట్ ఎయిర్పోర్ట్ , ఎయిరోట్రోపోలిస్ మోడల్.
- AI ఆధారిత స్మార్ట్ టౌన్షిప్ , లగ్జరీ విల్లా క్లస్టర్లు.
- ఆధ్యాత్మికత , వెల్నెస్ కలగలిసిన జీవన విధానం.
భవిష్యత్ తరాల అభివృద్ధికి వేదికగా..
సాన్ రామోన్ పరిసరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్, కేవలం ఒక వేదికగా మాత్రమే కాకుండా, టెక్నాలజీ ఆధారిత అనుభవ కేంద్రంగా, సెమినార్లు , భవిష్యత్ తరాల అభివృద్ధికి ఒక వేదికగా నిలుస్తుందని సంస్థ ప్రతినిధి శ్రీ రమేష్ తంగెల్లపల్లి వివరించారు.
“Building Wealth Together” అనే నినాదంతో సాగిన ఈ ఇన్వెస్టర్ మీట్లో పలువురు పెట్టుబడిదారులు భాగస్వామ్య ఒప్పందాల పట్ల ఆసక్తి కనబరిచారు. అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు , మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టి సారించిన A HUB GLOBAL, భవిష్యత్తులో మరిన్ని వినూత్న కార్యక్రమాలతో ముందుకు రానున్నట్లు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి








