పూరీ గురించి సేతుపతి ఎలివేషన్స్
టాలీవుడ్లో తన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్(Puri jagannadh) 26 ఏళ్ల సినీ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోవడంతో సినీ వర్గాల్లో సందడి నెలకొంది. బోల్డ్ క్యారెక్టరైజేషన్స్, ఫాస్ట్-పేస్డ్ టేకింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన పూరి, ఆధునిక కమర్షియల్ సినిమాల రూపురేఖలను మార్చిన దర్శకుడిగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి(Vijay sethupathi) సోషల్ మీడియా వేదికగా ఆయనకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ఎమోషనల్ పోస్టు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
తన మెసేజ్‌లో విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ సినీ ప్రయాణాన్ని ప్రశంసిస్తూ ఆయన ధైర్యం, కట్టుదిట్టమైన విజన్‌ను కొనియాడారు. 26 ఏళ్లు అంటే ఒక మైలురాయి మాత్రమే కాదు, అదొక వారసత్వం కూడా అని, నటులుగా మేము మాకు నమ్మకం ఉంచి, మా సామర్థ్యాలను మరింతగా వెలికితీయగల దర్శకులను కోరుకుంటామని, ఆ విషయంలో పూరి సర్ ప్రత్యేకమని పేర్కొన్నారు. అలాగే తమ కలయికలో తెరకెక్కుతున్న స్లమ్ డాగ్ సినిమా అందరికీ గుర్తుండిపోయే సినిమాగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక స్లమ్ డాగ్- 33 టెంపుల్ రోడ్(Slumdog- 33 Temple Road)పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాను జేబీ నారాయణరావు(Jb narayana rao), పూరి కనెక్ట్స్(puri connects) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో టబు(tabu), సంయుక్త మీనన్(samyuktha menon), దునియా విజయ్(duniy vijay) వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూరి జగన్నాథ్ స్టైల్, విజయ్ సేతుపతి నటన కలయికతో ఈ సినిమా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది.








