సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత ఆర్ బి చౌదరి దుర్మరణం
దక్షిణ భారత అగ్ర నిర్మాత ఆర్ బి చౌదరి ఈ రోజు రాజస్థాన్ లోని ఉదయపూర్ లో రోడ్ ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సినీ నిర్మాత, ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ అధినేత ఆర్బీ చౌదరి (R.B. Choudary) మరణం చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ సినీ నిర్మాత, ‘సూపర్ గుడ్ ఫిల్మ్స్’ అధినేత ఆర్బీ చౌదరి (R.B. Choudary) మరణం చిత్రసీమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలను నిర్మించి, సెంచరీ కొట్టిన అతికొద్ది మంది నిర్మాతలలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన మృతి వార్త తెలియగానే సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ ఆర్ బి చౌదరి గారి మరణం దిగ్భ్రాంతికరం
ప్రముఖ నిర్మాత, సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత శ్రీ ఆర్ బి చౌదరి గారు మరణం దిగ్భ్రాంతి కలిగించింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
నేను నటించిన ‘సుస్వాగతం’ చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం, సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని, చక్కటి గీతాలు ఉండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమల్లో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
ఇవి కూడా చదవండి
(పవన్ కళ్యాణ్)
ఉప ముఖ్యమంత్రి








