Ram Pothineni: రామ్ నెక్స్ట్ ఏంటి? వెయిటింగ్ తప్పేలా లేదే!
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni)తన తదుపరి చిత్రంపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రా కింగ్ తాలుకా(andhra king thalika) తర్వాత ఆయన ఎలాంటి ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించలేదు. ఈ నేపథ్యంలో, లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) శిష్యుడిగా గుర్తింపు పొందిన దర్శకుడు విఘ్నేష్(vignesh) తో రామ్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు గతంలో వినిపించాయి. కుటుంబ నిర్మాణంలో రూపొందే ఈ ప్రాజెక్ట్‌పై మంచి అంచనాలు నెలకొన్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం విఘ్నేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకి సరైన దర్శకుడిని వెతికే ప్రక్రియ మళ్లీ మొదలైంది.
ఇదిలా ఉంటే, రామ్ తన కెరీర్లో ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం. ఆంధ్రా కింగ్ తాలుకా కోసం పాట రాసి, ఆలపించిన ఆయన ఇప్పుడు కథారచయితగా కూడా మారాలని భావిస్తున్నాడట. తన తదుపరి సినిమాకి స్వయంగా కథను సిద్ధం చేసుకున్న రామ్, దాన్ని వెండితెరపై సమర్థంగా ఆవిష్కరించగల దర్శకుడి కోసం అన్వేషణ జరుపుతున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నటుడిగా మాత్రమే కాకుండా క్రియేటివ్ రంగంలోనూ తన ముద్ర వేయాలన్న తపన రామ్ నిర్ణయంలో కనిపిస్తోంది.
మరోవైపు, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా(arka media)) కూడా రామ్‌తో భారీ స్థాయి సినిమా చేయాలని ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనకు కథలు వినిపించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య రామ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ఎవరితో ప్రకటిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. మే 15న ఆయన పుట్టినరోజు సందర్భంగా రాన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అభిమానులు మాత్రం ఈ అప్డేట్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.








