పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘భోగి’, భారీ సెట్లో 20 రోజుల పాటు హై ఆక్టేవ్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ
‘చార్మింగ్ స్టార్’ శర్వా భారీ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ చిత్రం ‘భోగి’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు సంపత్ నందితో శర్వా చేస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మి రాధామోహన్ సమర్పిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఫస్ట్-లుక్, పుట్టినరోజు పోస్టర్లుకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా చిత్రంలోని రగ్గడ్, గ్రాండ్ స్కేల్ విజన్‌కు ప్రశంసలు లభించాయి. పల్లెటూరి యువతిగా కథానాయిక అనుపమ పరమేశ్వరన్ కనిపించిన ఫస్ట్-లుక్కు కూడా అద్భుతమైన స్పందన వచ్చింది.
ప్రస్తుతం, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్లో హై ఆక్టేవ్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించేలా, స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ సన్నివేశాన్ని మునుపెన్నడూ చూడని స్టయిల్ లో రూపొందిస్తున్నారు. ఈ కీలకమైన క్లైమాక్స్ లో శర్వా మోస్ట్ ఇంటెన్స్, రిస్కీ స్టంట్లతో తన నటనలో సరికొత్త కోణాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. సినిమాలోని ఈ కీలక భాగాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుంది.
ఈ చిత్రంలో డింపుల్ హయతి మరో కథానాయికగా నటిస్తోంది. 1960ల నాటి నేపథ్యంలో సాగే ‘భోగి’ చిత్రం, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక ఫిక్షనల్ విలేజ్ లో జరిగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.
ట్యాలెంటెడ్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. ఆర్ట్ డైరెక్షన్‌ను కిరణ్ కుమార్ మన్నె పర్యవేక్షిస్తుండగా, సినిమాటోగ్రాఫర్ కిషోర్ కుమార్ అరోకియా అద్భుతమైన విజువల్స్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలో ఆగస్టు 28న పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానున్న ‘భోగి’, రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఒక అద్భుతమైన బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమౌతోంది.








