శర్వాకు జోడీగా ఆ హీరోయిన్
టాలీవుడ్లో మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. డైరెక్టర్ శ్రీను వైట్ల(Srinu Vaitla)- హీరో శర్వానంద్(Sharwanand) కలయికలో కొత్త సినిమా ప్రారంభానికి వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్‌ను జూలైలో పూజా కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ చేసి, ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ దశ పూర్తవ్వగా, లొకేషన్స్, టెక్నికల్ టీమ్, షూటింగ్ షెడ్యూల్స్ అన్నీ ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీను వైట్లకు ఈ సినిమా కీలకంగా మారే అవకాశం ఉంది.
ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా అనంతిక సనీల్ కుమార్(Ananthika Sanil Kumar) ఎంపికైనట్లు సమాచారం. మ్యాడ్(Mad), 8 వసంతాలు(8 Vasanthalu) సినిమాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరోయిన్, ఈ ప్రాజెక్ట్‌తో మెయిన్‌స్ట్రీమ్‌లో మరింత స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా, శర్వానంద్ నేచురల్ యాక్టింగ్‌కు సరిపోయేలా, ఆమె పాత్రను కూడా డిజైన్ చేసినట్లు టాక్. ఇక దర్శకుడు శ్రీను వైట్ల, తన స్టైల్‌కు తగ్గ ఫుల్ ఎంటర్టైనర్ను సిద్ధం చేసి, కామెడీతో పాటు ఎమోషన్స్ ను మేళవించే ప్రయత్నం చేస్తున్నారట.
కథ విషయానికి వస్తే, చిన్న వయసులో చేసిన ఒక తప్పిదం వల్ల హీరో జీవితంలో చోటుచేసుకునే పరిణామాలు ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంతో డ్రామా, ఎమోషన్, కామెడీ మిక్స్‌తో కథను నడిపించనున్నారని సమాచారం. ఓ సీనియర్ నటుడు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఈ సినిమాను నిర్మించనుండగా, ఈ ప్రాజెక్ట్‌తో శ్రీను వైట్ల మళ్లీ ఫామ్‌లోకి వస్తాడా అన్న ఆసక్తి ఇండస్ట్రీలో నెలకొంది.
ఇవి కూడా చదవండి








