టాస్ తో కెరీర్ మారిపోయిందన్న శోభిత
బాలీవుడ్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగిస్తున్న శోభిత దూళిపాళ్ళ తెలుగు అమ్మాయి అనే విషయం తెలిసిందే. ఎడ్యుకేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి అందాల పోటీల్లో పాల్గొని, అక్కడి నుంచి రమణ రాఘవ సినిమాతో బాలీవుడ్ లోకి నటిగా అడుగుపెట్టింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది శోభిత.
రీసెంట్గా మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలో శోభిత కీ రోల్ చేసింది. వేరే భాషల్లో సక్సెస్ అవుతున్న శోభితకు తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు రావట్లేదు. ఇప్పటివరకు టాలీవుడ్ లో శోభిత చేసింది గూఢచారి, మేజర్ చిత్రాలు మాత్రమే. రీసెంట్గా ది నైట్ మేనేజర్ సిరీస్‌తో శోభిత, అనిల్ కపూర్‌తో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ది నైట్ మేనేజర్ ప్రమోషన్లలో భాగంగా శోభిత కపిల్ శర్మ షోలో పార్టిసిపేట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వైజాగ్‌లో ఎడ్యుకేషన్ పూర్తైన తర్వాత పెద్ద సిటీస్ వెళ్లాలనుకున్నప్పుడు బెంగుళూరు, ముంబైలను ఛాయిస్ లుగా తీసుకున్నానని, ఈ రెండింటిలో ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తూ కాయిన్ తో టాస్ వేస్తే ముంబై ఛాయిస్ గా వచ్చిందని, దీంతో వెంటనే ముంబైలో అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది. ఆ నిర్ణయం తన జీవితాన్ని మార్చేసినట్లు శోభిత ఈ షో లో చెప్పుకొచ్చింది.













