Cognizant: ఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్
తమ ఉద్యోగులకు ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) గుడ్ న్యూస్ చెప్పింది. 2025 సంవత్సరానికి గాను 100 శాతం బోనస్ ప్రకటించింది. రెండేళ్లకు ముందే కంపెనీ తన లక్ష్యాలను చేరినందుకు గానూ ఈ బోనస్ (Bonus) చెల్లింపులు చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ మేరకు కాగ్నిజెంట్ సీఈఓ ఎస్.రవికుమార్ (CEO S. Ravikumar) ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్ (Email) సందేశంలో పేర్కొన్నారు. ఉద్యోగుల క్రమశిక్షణ, పనితీరు, కాగ్నిజెంట్‌పై మన క్లయింట్ల నిబద్ధతకు 2025లో కంపెనీ సాధించిన ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఉద్యోగుల కషికి గుర్తింపుగా, 100 శాతం బోనస్ ప్రోగ్రామ్‌ను అమలుచేస్తాం అని రవికుమార్ తన సందేశంలో తెలిపారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






