తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి లోకేష్
తిరుమల: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మంత్రి లోకేష్ కు మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో పాటు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేష్ తిరుప్పావడ సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్ (Gali Bhanuprakash,), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








