టాక్సిక్ మేకర్స్ కావాలనే చేస్తున్నారా?
ఇటీవలి కాలంలో భారీ సినిమాల ప్రచార విధానంలో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే సక్సెస్ కు మెయిన్ ఫార్ములాగా భావించేవారు. అయితే ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు నిర్దిష్ట వర్గాన్నే టార్గెట్ గా చేసుకుని సినిమాలను రూపొందిస్తున్నారు. కంటెంట్ పరంగా ఎలాంటి రాజీ పడకుండా, అడల్ట్ థీమ్స్, తీవ్రమైన హింస, బోల్డ్ విజువల్స్‌తో సినిమాలను మార్కెట్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ కంటే యూత్, మాస్ ప్రేక్షకులే ప్రధాన టార్గెట్‌గా మారుతున్నారు.
ఈ ధోరణికి తాజా ఉదాహరణగా టాక్సిక్(toxic) నిలుస్తోంది. ఇప్పటివరకు రిలీజైన టీజర్లు, ప్రమోషనల్ మెటీరియల్‌ను గమనిస్తే సినిమా పూర్తిగా డార్క్, ఇంటెన్స్ టోన్‌లో సాగనున్నట్లు స్పష్టమవుతోంది. రొమాన్స్, యాక్షన్, హింస అంశాలను బలంగా చూపిస్తూ రూపొందించిన ప్రతి ప్రచార వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, కుటుంబ ప్రేక్షకులకు ఇది సరైన సినిమా కాదనే అభిప్రాయం ప్రారంభం నుంచే బలపడింది. మేకర్స్ కూడా అదే ఇమేజ్ను కొనసాగిస్తూ సినిమాపై ప్రత్యేకమైన అంచనాలు పెంచుతున్నారు.
అయితే ఫ్యామిలీ ఆడియన్స్ దూరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, యూత్ లో మాత్రం ఈ సినిమాపై ఆసక్తి తగ్గినట్లు కనిపించడం లేదు. బోల్డ్ కంటెంట్, స్టైలిష్ మేకింగ్, హై ఇంటెన్సిటీ యాక్షన్ అంశాలు యూత్ ఆడియన్స్ ను బలంగా ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇదే తరహా అడల్ట్ యాక్షన్ డ్రామాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు నమోదు చేసిన నేపథ్యంలో, టాక్సిక్ కూడా తన టార్గెటెడ్ ఆడియన్స్ ను మెప్పించగలిగితే వసూళ్ల పరంగా పెద్ద సెన్సేషన్‌గా నిలిచే అవకాశాన్ని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.








