పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘పినాక’ అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్
గోల్డెన్ మెగాస్టార్ గణేష్ పుట్టినరోజు సందర్భంగా ‘పినాక’ చిత్ర నిర్మాతలు సినిమాలోని ఆసక్తికరమైన ప్రపంచాన్ని పరిచయం చేసే ఒక ఆకట్టుకునే కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
ఒక పురాతన రహస్యాన్ని ఛేదించడంలో నిమగ్నమైన గణేష్‌ను ఒక ప్రత్యేకమైన గెటప్ లో చూపిస్తున్న ఈ పోస్టర్, సాహసం, పురాణాలు, రహస్యాలు, అద్భుతాలతో నిండిన ఒక సినిమా ప్రయాణమైన ‘పినాక’ సారాంశాన్ని సంపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. ఈ ఈ పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది.
ఈ సందర్భంగా చిత్రబృందం గోల్డెన్ మెగా స్టార్ గణేష్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘పినాక’లో ఆయనను ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని కొత్త కోణంలో చూడబోతున్నారని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలియజేశారు.
అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుందని ప్రకటించారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బి. ధనంజయ దర్శకత్వం వహిస్తున్నారు.








