టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు, బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. తిరుపతిలోని కర్ణాటక భవన్లో జరిగిన ఈ వివాహ కార్యక్రమానికి హాజరై వధూవరులు వైష్ణవి, హర్షవర్థన్ రెడ్డిలను సీఎం చంద్రబాబు ఆశీర్వదించారు.









