సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం … ఈసారి ఆన్ లైన్ లో
పొదుపు చర్యల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. మహానాడు (Mahanadu) ను ఈసారి ఆన్ లైన్ (Online) లో నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ (NTR Bhavan) లో వేదిక ఏర్పాటు చేసి నిర్వహించాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో పార్టీ శ్రేణుల కోసం ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నారు. ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్ బ్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి నెల్లూరు జిల్లా (Nellore District)లో మహానాడు నిర్వహించాలని ఇదివరకు నిర్ణయించి ఏర్పాట్లు ప్రారంభించారు. పొదపు చర్యల్లో భాగంగా ఆన్ లైన్ లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 27, 28న మహానాడు జరగనున్న సంగతి తెలిసిందే.






