ఏపీ సీఎస్‌గా జీ సాయిప్రసాద్ పదవీకాలం పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ (Sai Prasad) పదవీ కాలం పొడిగించారు. మరో ఆరు నెలలు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా సర్వీసును పొడిగిస్తూ కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు స్పందించిన కేంద్ర సిబ్బంది శాఖ, 2026 జూన్ 1 నుంచి నవంబర్ (November) 30 వరకు సేవల పొడిగింపునకు అనుమతి మంజూరు చేసింది. ఆల్ ఇండియా సర్వీస్ (All India Service) రూల్స్ మేరకే ఈ పొడిగింపు మంజూరైనట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల్లో వెల్లడించింది. 1991 ఐఏఎస్ (IAS) బ్యాచ్ అధికారి సీఎస్ సాయిప్రసాద్ 2026 మార్చి 1వ తేదీన బాధ్యతలు స్వీకరించారు.






