పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా తుపాకీ హింస : డాక్టర్ వివేక్ మూర్తి
అమెరికాలో తుపాకీ హింస ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా మారిందని ఆ దేశ సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుపాకీ హింస వల్ల మరణాలను తగ్గించడం కోసం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఆటోమేటిక్ రైఫిల్స్‌ను నిషేధించాలని, తుపాకులను కొనాలనుకునేవారి నేపథ్యాన్ని తనిఖీ చేయాలని తెలిపారు. తుపాకుల తయారీ పరిశ్రమను క్రమబద్దీకరించాలని, బహిరంగ ప్రదేశాల్లో తుపాకుల వినియోగంపై ఆంక్షలు విధించాలని చెప్పారు.








