వైఎస్ జగన్ తో ఆటా నాయకుల భేటీ
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ ఆర్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి గారిని అమెరికా తెలుగు సంఘం (ఆటా) నాయకులు కలిశారు. అమరావతిలో ఆయనను కలిసి మేరీల్యాండ్ రాష్ట్రము లో జరగనున్న 19వ ఆటా మహాసభలకు రావలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ ప్రవాస తెలుగు వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి ప్రముఖ నాయకులూ, సినీ రంగ ప్రముఖులు, కళాకారులూ పాల్గొంటున్న ఈ మహాసభలకు వైసీపీ ప్రతినిధులని పంపించేందుకు మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు సుముఖత వ్యక్తపరిచారు. ఆటా మహాసభలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఆటా వారికీ సహకరించాలని వైసీపీ సమన్వయకర్త సజ్జల రామకృష్ణ రెడ్డి, కార్యదర్శి సాంబశివరెడ్డిలని ఆదేశించారు.
ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్ల, పూర్వాధ్యక్షులు భువనేశ్ బుజాల, శరత్ వేముల, శ్రీకాంత్ గుడిపాటి తదితరులు జగన్ గారిని కలిసినవారిలో ఉన్నారు.








