చరణ్ తో మోస్ట్ మెమొరబుల్ మూమెంట్స్ అవే!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) హీరోగా బుచ్చిబాబు సాన(Buchibabu sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ సినిమా పెద్ది(Peddi) షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi kapoor) హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రెస్ మీట్లో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నిర్మాత వెంకట సతీష్ కిలారు(Venkata satish kilaru) మాట్లాడుతూ పెద్దిను జూన్ 4న దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, జూన్ 3వ తేదీ సాయంత్రం నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వేయనున్నట్టు చెప్పడంతో మెగా అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
ఇవి కూడా చదవండి
ఇదిలా ఉండగా, షూటింగ్ సందర్భంగా చోటుచేసుకున్న కొన్ని మధుర జ్ఞాపకాలను కూడా నిర్మాత సతీష్ కిలారు పంచుకున్నారు. షూటింగ్ జరిగిన అన్ని రోజుల్లో తాను రామ్ చరణ్‌తో కలిసి భోజనం చేసినట్లు తెలిపారు. ప్రతిరోజూ చరణ్ తన ఇంటి నుంచి తీసుకువచ్చిన భోజనాన్ని తనతో మరియు డైరెక్టర్ బుచ్చిబాబుతో పంచుకునేవారని చెప్పారు. షూటింగ్ చివరి రోజు కూడా అందరూ కలిసి భోజనం చేసిన సందర్భం తనకెంతో ప్రత్యేకంగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ అనుభవాలు సినిమా ప్రయాణాన్ని మరింత మధురంగా మార్చాయని ఆయన వ్యాఖ్యానించారు.
భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(Mythri movie makers) సమర్పిస్తుండగా, వృద్ధి సినిమాస్(Vriddhi cinemas) బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, సుకుమార్ రైటింగ్స్(Sukumar writings) బ్యానర్లో డైరెక్టర్ సుకుమార్(Sukumar) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్లో ఈ సినిమాపై మంచి హైప్ నెలకొనగా, రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయి. కంటెంట్, ఎమోషన్, మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి








