స్పైడర్ మ్యాన్ : ఫార్ ఫ్రమ్ హోమ్ తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జులై 26
ప్రతీ మనిషిలో ఒక హీరో ఉంటాడు, సందర్భం వచ్చినప్పుడు ఆ హీరో బయటకు వస్తాడు. అలాంటి ఒక సూపర్ హీరో స్పైడర్ మ్యాన్. చిన్నపటి నుంచి ఎన్నో స్పైడర్ మ్యాన్ చిత్రాలు చూసాము కానీ ఈసారి మనముందుకు రాబోతుంది ఒక వీరుడు మరియు అవెంజర్స్ యొక్క ధైర్యాన్ని పుణికిపుచ్చుకున్న ఒక యోధుడి కథ – ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్’. మనకి ఎంతో ఇష్టమైన జీ తెలుగు ఛానల్ ఈ ఆదివారం జులై 26 సాయంత్రం 6: 30 గంటలకు ‘స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్’ సినిమాను తెలుగు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారంచేయబోతుంది.
పీటర్ పార్కర్ (టామ్ హాలండ్), అవెంజర్స్ ఎండ్ గేమ్ లో తన గురువు టోనీ స్టార్క్ (రాబర్ట్ డౌనీ జూనియర్) కోల్పోయిన బాధలో నుండి బయటికి రాలేదు. తన వల్లనే టోనీ చనిపోయాడని భావిస్తాడు. అందుకే కొన్ని రోజులు ఈ సూపర్ హీరో పనులకి దూరంగా ఉండాలని నిర్ణయించుకొని తన స్కూల్ స్నేహితులతో కలిసి ఎడ్యుకేషన్ ట్రిప్ కి ఇటలీకి వెళతాడు. తాను ఏ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నాడో అవే బాధ్యతలు నిక్ (సామ్యూల్ ఎల్. జాక్సన్) కారణంగా మళ్లీ తనకు తారసపడతాయి.
జాన్ వాట్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పీటర్ పంచభూతాలతో పోరాడవలసి ఉంటుంది. నిక్ ఇచ్చే బాధ్యతలు పీటర్ సంపూర్ణగా నిర్వహించాడా? ఏ విధంగా తను పోరాడి గెలిచాడు తెలుసుకోవాలంటే స్పైడర్ మ్యాన్: ఫార్ ఫ్రమ్ హోమ్ చూడాల్సిందే.
అమోఘంమైన స్పైడర్ మ్యాన్ ధైర్య సాహసాలు మిస్ కాకుండా చూడండి. ఈ ఆదివారం జులై 26 సాయంత్రం 6: ౩౦ గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీ ఛానల్లలో… మీ ఆప్తులుగా మేము కోరుకునేది ఒక్కటే, జాగ్రత్తగా ఉండండి. మేమందించే ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించండి.
ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి. జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి. జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి. నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్. మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.













