Divi: పుష్ప2లో నా క్యారెక్టర్ ను బాగా తగ్గించేశారు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్(sukumar) కాంబినేషన్లో వచ్చిన పుష్ప2(pushpa2) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. కలెక్షన్స్, రికార్డుల పరంగా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేసిన ఈ సినిమా, ఎడిటింగ్ ప్రక్రియపై చర్చకు దారి తీసే ఒక అనుభవాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన దివి తన పాత్రకు సంబంధించిన అనుభవాన్ని తాజాగా వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
ఇవి కూడా చదవండి
బిగ్‌బాస్(biggboss) ద్వారా గుర్తింపు పొందిన దివి(Divi), చిన్న పాత్రలతో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. పుష్ప2 సినిమాలో రిపోర్టర్ పాత్రలో కనిపించింది దివి. కథ చెప్పినప్పుడు తన పాత్రకు ప్రాముఖ్యత ఉందని చెప్పారని, టీజర్లో కూడా కనిపించడం వల్ల ఇది తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతుందని భావించినట్లు ఆమె తెలిపింది. దాదాపు 20 రోజుల షూటింగ్, మరో 10 రోజుల డబ్బింగ్ చేసినప్పటికీ, ఫైనల్ కట్లో తన సీన్స్ ను చాలా వరకు తొలగించబడినట్లు వెల్లడించింది.
థియేటర్లో సినిమా చూసినప్పుడు తన పాత్ర పరిమితం కావడం షాక్‌కు గురి చేసిందని, టీజర్లో కనిపించిన కొన్ని సన్నివేశాలు కూడా సినిమాలో లేకపోవడం నిరాశ కలిగించిందని ఆమె చెప్పింది. కొత్త ఆర్టిస్టుల ఆశలు ఇలా దెబ్బతినడం ఇండస్ట్రీలో తరచూ జరుగుతుందనే విషయం ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది. అయినప్పటికీ, ఇలాంటి అనుభవాలను ప్రొఫెషనల్‌గా తీసుకుని ముందుకు సాగాల్సిందేనని దివి చెప్పిన మాటలు ఆదర్శంగా నిలిచాయి.
ఇవి కూడా చదవండి








