పెద్ది ట్రైలర్ డైలాగ్ ను లీక్ చేసిన చిరంజీవి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) చేసిన తాజా వ్యాఖ్యలు సినిమాపై హైప్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఇటీవల ప్రత్యేకంగా ట్రైలర్‌ను వీక్షించిన చిరంజీవి, తన ఉత్సాహాన్ని అదుపులో పెట్టుకోలేక సోషల్ మీడియాలో స్పందించడం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. దీంతో మరోసారి #ChiruLeaks సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.
ట్రైలర్ చూసిన అనంతరం డైరెక్టర్ బుచ్చిబాబు సాన(Buchi Babu Sana)కు సరదాగా క్షమాపణలు చెబుతూ, ఎగ్జైట్మెంట్ ఆపుకోలేకపోయానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ట్రైలర్లో ఎమోషన్స్, ఎలివేషన్స్, ఇంటెన్స్ డ్రామా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని ఆయన చెప్పడం మెగా అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ముఖ్యంగా “మీరందరూ నేను ఆడానని అనుకుంటున్నారు… నేను పోరాడాను సార్…” అనే డైలాగ్‌ను చిరంజీవి లీక్ చేయడంతో ఆ డైలాగ్‌కు సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ఒక్క డైలాగ్‌తోనే హీరో పాత్రలోని ఎమోషనల్ డెప్త్ ఎంత బలంగా ఉండబోతోందో అర్థమవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ట్రైలర్లో ఏఆర్ రెహమాన్ (A. R. Rahman) అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, బుచ్చిబాబు విజన్ కలిసి సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాయని మెగాస్టార్ అన్నారు. మే 18న ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించగా, రిలీజ్‌కు ముందే ఏర్పడిన ఈ హైప్ ఇప్పుడు ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తోంది. వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు(Venkata satish Kilaru) నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
https://x.com/KChiruTweets/status/2055583268905615570?s=20







