భారతదేశంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో No.1 బ్రాండ్‌గా నిలిచిన ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్
జెమినీ ఎడిబల్స్ – ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ (జీఈఎఫ్ ఇండియా)కు చెందిన ప్రతిష్టాత్మక బ్రాండ్ ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ను భారతదేశంలో అమ్మకాల పరిమాణం పరంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో నెంబర్ 1 బ్రాండ్‌గా గుర్తించారు (మార్చి31, 2022 నాటికి ముగిసిన ఆర్ధిక సంవత్సరం (ఎంఏటీ) కోసం భారతదేశంలో రిఫైండ్ ఆయిల్ కాన్స్ ప్యాక్ (ఆర్ఓసీపీ) మార్కెట్ (యు+ఆర్)పై నీల్సన్ ఐక్యు డాటా ). ఫ్రీడమ్ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఈ ప్రతిష్టాత్మక మైలురాయిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్నాటక మరియు ఒడిషాలలో కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా చేరుకుంది. ఈ మార్కెట్లలో పూర్తిగా ఈ బ్రాండ్ చొచ్చుకుపోవడానికి ప్రతీకగా ఈ ర్యాంక్ నిలువడం మాత్రమే కాదు, ఈ బ్రాండ్ పట్ల వినియోగదారుల ప్రాధాన్యత సైతం తెలుపుతుంది. నాణ్యత, స్ధిరత్వం మరియు ఈ వంట నూనెల బ్రాండ్ –ఫ్రీడమ్ పట్ల వారి నమ్మకాన్ని ఇది వెల్లడిస్తుంది. ఫ్రీడమ్ ఇప్పుడు రైస్ బ్రాన్ ఆయిల్, వేరుశెనగ నూనె, ఆవనూనె కూడా అందిస్తుంది. నీల్సన్ ఐక్యు అధ్యయనం ఇప్పుడు కిరాణా, జనరల్ స్టోర్స్, కెమిస్ట్‌లు, కాస్మెటిక్ స్టోర్లు, పాన్ ప్లస్ స్టోర్లు, మోడ్రన్ ట్రేడ్ స్టోర్లు ను కూడా కవర్ చేస్తుంది.
దీనితో పాటుగా జీఈఎఫ్ ఇండియా ప్లాటినమ్ అవార్డును ‘హయ్యస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ ఇన్ ఇండియా’ (భారతదేశంలో అత్యధికంగా ముడి పొద్దుతిరుగుడు పువ్వు నూనెను దిగుమతి చేసుకున్న సంస్ధ)గా గ్లోబాయిల్ అవార్డు 2021 వద్ద గెలుచుకుంది. 2018లో గ్లోబాయిల్ ఇండియా ‘ఎమర్జింగ్ బ్రాండ్’ అవార్డును ఫ్రీడమ్ బ్రాండ్‌కు అందజేసింది. ఇండియా టు డే ‘ఇప్సోస్ అర్బన్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే 2020’ ప్రకారం భారతదేశంలో అగ్రశ్రేణి 5 కుకింగ్ఆయిల్ బ్రాండ్స్‌లో ఒకటిగా ఫ్రీడమ్ బ్రాండ్ నిలిచింది.
సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో మార్కెట్ అగ్రగామిగా ఫ్రీడమ్ ఆయిల్ నిలిచింది. దీని నాయకత్వ స్ధానం మరియు విస్తృతంగా ఈ ఉత్పత్తులు ప్రజలకు చేరువకావడానికి విస్తృతస్థాయి పంపిణీ నెట్వర్క్ కారణం. జీఈఎఫ్ ఇండియాకు భారతదేశంలో అత్యాధునిక ఫెసిలిటీలు ఉన్నాయి. అవి కాకినాడ (2) మరియు నెల్లూరు లోని కృష్ణపట్నం వద్ద ఉన్నాయి. ఇవి రోజుకు 2615 మెట్రిక్ టన్నుల ను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ ఫెసిలిటీకి డెస్మెట్ బల్లెస్ట్రా (బెల్జియం) నుంచి యంత్రసామాగ్రి వచ్చింది. కృష్ణపట్నం ఫెసిలిటీ ఎఫ్ఎస్ఎస్సీ 22000 ధృవీకరణ పొందింది. ఇదే ధృవీకరణను కాకినాడలోని మూడవ రిఫైనరీ వద్ద పొందే ప్రయత్నంలో ఉంది. ఈ కంపెనీ అత్యంత చురుగ్గా ఇప్పుడు ప్యాకేజింగ్‌పై దృష్టి పెట్టింది. తద్వారా డిజైన్ మరియు నాణ్యత రెండూ కూడా వినియోగదారులకు అనుకూలంగా మారుస్తుంది.
ఈ సందర్భంగా జెమినీ ఎడిబల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ చౌదరి మాట్లాడుతూ‘‘ సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగంలో విలువ పరంగా భారతదేశంలో నెంబర్ 1 బ్రాండ్‌గా ఫ్రీడమ్ నిలువడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఇక్కడ మేము 20.5% మార్కెట్ వాటాను పొంది ఉన్నాము (నీల్సన్ ఐక్యు మ్యాట్ మార్చి 2022). వినియోగదారుల లక్ష్యిత విధానం, విస్తృతశ్రేణి పంపిణీ నెట్వర్క్, నాణ్యతపై దృష్టి సారించడం వంటివి దీనికి కారణాలు. వ్యూహాత్మక విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తోంది. రాబోయే ఐదేళ్లలో మేము తమిళనాడు, కేరళలలో కూడా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రణాళిక చేశాము. ఈ రెండు రాష్ట్రాలలోనూ అత్యధిక పరిమాణంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగిస్తున్నారు. అంతేకాదు, మేము మా కార్యకలాపాలను ఉత్తర భారతదేశంతో పాటుగా తూర్పు భారత రాష్ట్రాలైన ఛత్తీస్‌ఘడ్, జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్‌లలో కూడా విస్తరించనున్నాం’’ అని అన్నారు.
ఫ్రీడమ్ హెల్తీ కుకింగ్ ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ శ్రీ పీ చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ ‘‘ భారతదేశంలో మార్కెట్ వాటా ప్రకారం నెంబర్1 సన్‌ఫ్లవర్ ఆయిల్ బ్రాండ్ గా నిలువడం పట్ల సంతోషంగా ఉన్నాము. గత దశాబ్ద కాలంగా మా వినియోగదారులు మాపై చూపుతున్న విశ్వాసం, మాకు అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ధన్యవాదములు తెలుపుతున్నాము. ఆధారపడతగిన మరియు నమ్మదగిన బ్రాండ్‌ను నిర్మించడం తో పాటుగా అత్యధిక వినియోగదారుల సంతృప్తిని పొందడంపై దృష్టి సారించాము. ఆలోచనాత్మక, లక్ష్యిత మార్కెట్ వ్యూహం, ఆవిష్కరణల ద్వారా మా బ్రాండ్ విజిబిలిటీని మరింతగా వృద్ధి చేయనున్నాం’’ అని అన్నారు.
ఆరోగ్యం పట్ల ఆప్రమప్తత పెరగడంతో, ఆరోగ్యవంతమైన నూనెలను అభిమానించడమూ పెరిగింది. పొద్దు తిరుగుడు (సన్‌ఫ్లవర్), ఆవ (మస్టర్డ్), వేరుశెనగ (గ్రౌండ్నట్) మరియు రైస్ బ్రాన్ వంటి రకపు నూనెలను పామ్ ఆయిల్స్‌తో పోల్చినప్పుడు ఆరోగ్యవంతమైనవిగా భావిస్తున్నారు. భారతీయ వంటకాలకు అత్యంత అనువైన నూనెగా సన్‌ఫ్లవర్ నూనెను భావిస్తున్నారు. అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల కూడా దీనిలోని పోషక విలువలు నిలిచి ఉంటాయి. ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్లో విటమిన్ ఏ మరియు డీ లను సైతం కలుపుతున్నారు. దీనిలో సహజసిద్ధంగా ఉండేటటువంటి విటమిన్ ఈ కూడా ఉంది. ఆరోగ్యం పట్ల పూర్తి స్పృహ కలిగిన వినియోగదారుల రోజువారీ వినియోగానికి ప్రాధాన్యతా ఎంపికగా ఇది నిలుస్తుంది.






