Pithapuramlo: పద్మశ్రీ’ పురస్కారం తర్వాత విడుదలయ్యే డా. రాజేంద్రప్రసాద్ మొదటి చిత్రం ‘పిఠాపురంలో’
ప్రేయసి రావే, అయోధ్య రామయ్య, చెప్పాలని వుంది, జోరుగా హుషారుగా, ఒక్కడే, హనుమంతు, ఆలస్యం అమృతం, రెడ్ అలర్ట్” వంటి చిత్రాలతో దర్శకునిగా మంచి గుర్తింపు సంపాదించారు మహేష్ చంద్ర . తాజాగా ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పిఠాపురంలో’. దీనికి ఉపశీర్షిక ‘అలా మొదలైంది’ .ఈ చిత్రంలో ‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్, పృధ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, జయవాహిని, అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే దాసరి పద్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా, Jr. పవన్ కళ్యాణ్, J.D.V ప్రసాద్, K.A. పాల్ రాము, జబర్దస్త్ శేషు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు మహేష్ చంద్ర సినిమా టీమ్ బ్యానర్‌పై దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళీ (గోదారి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పార్ట్ పూర్తయిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ, “ఇది ముగ్గురు అమ్మాయిల కథలా అనిపించే ముగ్గురు తండ్రుల వ్యధ. ఈ ఇంటర్ నెట్ తరం తెలుసుకోవాల్సిన అసలైన కథ ఇది. ఈ సినిమా చూస్తుంటే, చుట్టూ ఉన్న సమాజాన్ని, చాలా కుటుంబాల్ని, ఎంతోమంది జీవితాలను చూస్తున్నట్టే ఉంటుంది. అలాగని ఇదేదో పక్తు సెంటిమెంట్ సినిమా అనుకోవద్దు. ఇందులో ప్రేమ ఉంది. రొమాన్స్ ఉంది. వినోదం ఉంది. మంచి ఫంచ్ డైలాగులు ఉన్నాయి. చక్కటి పాటలు ఉన్నాయి. అటు యువతని, ఇటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఇటీవల కాలంలో ‘పిఠాపురం’ పేరు ఎంతలా చర్చల్లో నిలిచిందో అందరికీ తెలుసు. ఆ నేపథ్యాన్ని ఆధారంగా తీసుకుని ఈ కథను మలిచాం. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం” అని తెలిపారు.
పద్మశ్రీ పురస్కారం పొందిన డా. రాజేంద్రప్రసాద్‌కు శుభాకాంక్షలు
‘నటకిరీటి’ డా. రాజేంద్రప్రసాద్ ఇటీవల ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ పురస్కారం పొందిన విషయం తెలిసిందే. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గానూ వచ్చిన ఈ గౌరవాన్ని పురస్కరించుకుని చిత్రబృందం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. పద్మశ్రీ అవార్డు తర్వాత విడుదలయ్యే డా. రాజేంద్రప్రసాద్ తొలి చిత్రం ‘పిఠాపురంలో’ కావడం తమ అదృష్టమని మహేష్ చంద్ర సంతోషం వ్యక్తంచేశారు. ఈ సినిమా క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ నటన అద్భుతం అని మహేష్ చంద్ర ప్రశంసించారు.
ప్రసిద్ధ ఆదిత్యా మ్యూజిక్ సంస్థ కి ఆడియో హక్కులు
ఈ చిత్రానికి సంగీతాన్ని G.C. క్రిష్ అందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ‘ఆదిత్యా మ్యూజిక్’ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉన్నాయి. ప్రతీ పాట కూడా ప్రత్యేక శైలిలో, విభిన్నమైన ట్యూన్స్‌తో రూపొందినట్లు చిత్రబృందం తెలిపింది. గోవా, హైదరాబాద్, సూరంపాలెంలోని ఆదిత్య కాలేజ్ లొకేషన్లలో పాటల చిత్రీకరణ జరిగింది.






