Mruthyunjay: శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్’.. ఫిబ్రవరి 27న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు ఎప్పటికప్పుడు వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వారి హృదయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన తాజా చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రమ్య గున్నం సమర్పణలో లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా జాన్ జంటగా నటిస్తున్నారు.
‘మృత్యుంజయ్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 27న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. పోస్టర్‌ను గమనిస్తే..పేపర్లతో నిండిన రోడ్డుపై నిలబడిన శ్రీవిష్ణుని గమనించవచ్చు. ఈ విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. పక్కా ప్రమోషన్స్, ఉత్కంఠతభరితమైన కథాంశంతో ‘మృత్యుంజయ్’ మూవీ ప్రేక్షకులను మెప్పించేలా రూపొందుతోంది.
హీరో శ్రీవిష్ణు స్టైల్లో ఆసక్తికరమైన థ్రిల్లర్ మూవీగా మృత్యుంజయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి విద్యాసాగర్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా కాల భైరవ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. మనీషా ఎ.దత్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వర్క్ చేస్తున్నారు.






