MSVPG: ఆల్-టైమ్ ఇండస్ట్రీ రీజినల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘మన శంకరవర ప్రసాద్ గారు’
సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ బాక్సాఫీస్ సంచలనంగా మారింది. ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుని, అన్ని ప్రాంతాలలోనూ అద్భుతంగా కొనసాగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది.
ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులు, ఈ చిత్రంలోని వినోదం, భావోద్వేగం, చిరంజీవి మాగ్నటిక్ పెర్ఫార్మెన్స్ కోసం థియేటర్లకు పోటెత్తుతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘MSG’ నాల్గవ వారంలో కూడా తన విజయ పరంపరను కొనసాగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా 375 కోట్ల మార్కును దాటిన ఈ చిత్రం ఇప్పుడు ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి, అద్భుతమైన వసూళ్లను నమోదు చేస్తూనే ఉంది. ఇది చిరంజీవి, అనిల్ రావిపూడి ఇద్దరికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా, ఇది బుక్‌మైషోలో అత్యధిక టిక్కెట్ల అమ్మకాలతో కొత్త రీజినల్ రికార్డును కూడా నెలకొల్పింది. విదేశాలలో 3.5 మిలియన్ డాలర్ల మైలురాయికి చేరువలో ఉంది.
విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటించిన ‘MSG’ చిత్రం మరో మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమౌతోంది. 400 కోట్ల మార్కును చేరుకునే దిశగా దూసుకుపోతోంది.






