ముంబై లో ట్రీట్ ఇవ్వనున్న తారక్?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ. ఎన్టీఆర్(NTR) పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని అభిమానులకు భారీ ట్రీట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prasanth Neel) తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ డ్రాగన్(Dragon)(#NTRNeel) నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మే 19 అర్ధరాత్రి విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఉన్న అంచనాల దృష్ట్యా, గ్లింప్స్ రిలీజ్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా వచ్చే ఈ అప్డేట్ సోషల్ మీడియాలో భారీ హైప్‌ను క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఈ గ్లింప్స్ లాంచ్ కోసం ఎన్టీఆర్ స్వయంగా ముంబై వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ నేషనల్ మీడియా సమక్షంలో ప్రత్యేక ఈవెంట్ నిర్వహించి ఫస్ట్ విజువల్‌ను గ్రాండ్‌గా ఆవిష్కరించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోందట. సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో బాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా ఈ మూవీపై భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా నార్త్ మార్కెట్లో తెలుగు సినిమాలకు పెరుగుతున్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ప్రమోషన్స్‌ను ముంబై నుంచే ప్రారంభించాలనే వ్యూహంతో మేకర్స్ ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్గా నటిస్తుండగా, సంగీత సంచలనం రవి బస్రూర్(Ravi Basrur) సంగీతం అందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు ఇప్పటికే సినీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.






