ఆంధ్రప్రదేశ్‌కు గుడ్‌న్యూస్ .. రూ.5.11 లక్షల కోట్లతో!
నాబార్డు (NABARD) 2026-27 సంవత్సరానికి గాను రూ.5.11 లక్షల కోట్ల రుణ ప్రణాళికతో రూపొందించిన నాబార్డు క్రెడిట్ ప్లాన్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆవిష్కరించారు. రుణ ప్రణాళిక గతేడాడి రూ. 4.2 లక్షల కోట్లు ఉండగా, ఈ ఏడాది 20 శాతం పెంచి రూ.5,11,491 కోట్లతో ప్రాథమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించింది. సాగుకు మొత్తం రూ.2.55 లక్షల కోట్లు కేటాయించింది. ఇందులో పంట రుణాలు రూ.1.66 లక్షల కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.34,972 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.8.265 కోట్లు ఫిషరీస్‌కు రూ.21.098 కోట్లు, హార్టికల్చర్ (Horticulture)కు రూ.11.961 కోట్లు కేటాయించింది. హార్టికల్చర్‌లో రాయలసీమ (Rayalaseema), ప్రకాశం, జిల్లాలకు రూ.5,313 కోట్లు కేటాయించారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలకు రూ.9.957 కోట్లు, అనుబంధ కార్యకలాపాలకు రూ.12.686 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. అలాగే ఎంఎసఎంఈ లకు రూ.1.64 లక్షల కోట్లు చొప్పున కేటాయించింది.
ఇవి కూడా చదవండి








