కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు : చంద్రబాబు
కూటమి పార్టీలు, నాయకుల మధ్య విస్తృత సమన్వయం ఉండాలని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) ప్రజాప్రతినిధులతో తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. నేను, పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఎంత సఖ్యతతో ఉంటున్నామో, క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల కేడర్ మధ్య కూడా అంతే సఖ్యత ఉండాలి. కూటమి పార్టీల కార్యకర్తల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దు. బాగా పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహించాలి అని దిశా నిర్దేశం చేశారు. సంక్షేమం చేస్తున్నాం. అభివృద్ధి (Development) చేస్తున్నాం అని మితిమీరిన విశ్వాసంతో ఏ ఒక్కరూ వ్యవహరించొద్దు. ప్రభుత్వ పనితీరే కాదు. నేతల వ్యక్తిగత ప్రవర్తనను కూడా ప్రజలు లెక్కిస్తారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలకంటే ప్రజల ఆలోచనలకే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలి అని స్పష్టం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








