సింగపూర్‌లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి చంద్రబాబు
• ప్రపంచ ఆర్ధిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది.
• త్వరలోనే భారత ఎకనామిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది
• వికసిత్ భారత్ 2047 విజన్ లాగే స్వర్ణాంధ్ర 2047 విజన్ కు రూపకల్పన చేశాం
• సుదీర్ఘమైన తీరప్రాంతం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం
• ఆక్వా, హార్టికల్చర్, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రంగా ఉంది
• దేశంలోనూ, రాష్ట్రంలోనూ సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి.
• ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా వివిధ దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి
• పూర్తి స్థాయి సన్నద్ధతతో ఈ సంక్షోభాన్ని కూడా భారత్ సమర్ధంగా ఎదుర్కోగలిగింది.
• ఏపీ నుంచి ఎగుమతులు పెంచేందుకు మేం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం.
• దీనికి అనుగుణంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు సిద్ధం చేస్తున్నాం
• రాష్ట్ర అభివృద్ధి కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆర్ధిక అసమానతలు తొలగించేలా పనిచేస్తున్నాం
• ఏపీలోని యువ శక్తి సామర్ధ్యాలను పెంచేలా అందరికీ నైపుణ్యాలను పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం
• పారిశ్రామిక అనుకూల పరిస్థితులను కల్పించేలా 26 పారిశ్రామిక విధానాలను అమలు చేస్తున్నాం
• ఏపీలో భూమి లభ్యత, నీటి లభ్యత ఉంది. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా ఉంది
• పారిశ్రామికంగా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నాం.
• ఏపీలోని ప్రతీ ఒక్కరినీ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం తెచ్చాం
• అలాగే ఎంఎస్ఎంఈ సహా వివిధ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతపై కూడా దృష్టి పెట్టాం
• రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ఎక్కడా జాప్యం లేకుండా అనుమతులు వేగంగా వచ్చేలా చూస్తున్నాం
• ఏపీకి ఉన్న 1 వెయ్యి కిలోమీటర్లకు పైగా ఉన్న తీర ప్రాంతంలో 6 ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయి.
• ఈ పోర్టులను దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశీ పోర్టులకు కనెక్టు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం
• 7 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు ఏపీలో ఉన్నాయి.
• భోగాపురం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్ నగరాలకు కనెక్టివిటీ ఏర్పడుతుంది
• లాజిస్టిక్స్, అగ్రికల్చర్, సివిల్ ఏవియేషన్, ఎనర్జీ లాంటి వివిధ అంశాల్లో ఫంక్షనల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం
• ఏపీలో ఉన్న పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలు అనుసంధానించేలా రహదారి, రైల్ నెట్‌వర్క్‌ను కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తున్నాం
• ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ క్లస్టర్లతో పాటు రాష్ట్రంలోని 175 చోట్ల నియోజకవర్గ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం
• ఈ పారిశ్రామిక పార్కులకు నీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయి
• రాయలసీమలోని పుట్టపర్తి వద్ద 5వ తరం ఫైటర్ జెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ కూడా వస్తోంది.
• ఈవీల వినియోగం పెంచటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నాం
• అమరావతిని మరో సింగపూర్‌గా తయారు చేయాలని మేం ప్రయత్నిస్తున్నాం
• ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయటంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలను కనెక్టు చేయబోతున్నాం
• హైస్పీడ్ రైల్ నెట్వర్క్ కూడా అమరావతిని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను కనెక్టు చేస్తుంది
• బ్లూ, గ్రీన్ సిటీగా అమరావతిని నిర్మించటం తోపాటు ఈవీల వినియోగం, గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం
• అమరావతిలోనే ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేస్తున్నాయి
• భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడులు భారత్‌కు వస్తున్నాయి
• ఇందులో 25 శాతం మేర ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి
• భారత్‌లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి.
• పోర్టులు, ఎయిర్ పోర్టులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను కనెక్టు చేస్తున్నాయి
• అంతర్జాతీయంగా ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కునేలా కొన్ని దేశాలు సొంతంగా నిధిని ఏర్పాటు చేశాయి
• సింగపూర్ లాంటి దేశాలు సావరిన్ ఫండ్స్ ను ఏర్పాటు చేసుకున్నాయి
• సమీప భవిష్యత్ అంతా స్టార్టప్ లదే. వాటిని ప్రోత్సహిస్తే పెద్దఎత్తున ఉత్పత్తికి అవకాశం ఉంటుంది
• పెద్ద కంపెనీలు, సంపన్నులు స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టడం విజయవంతమైన మార్గంగా చూస్తున్నాయి
• అమరావతిలోనూ ఓ ఫైనాన్షియల్ డిస్టిక్ట్ ను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఈ ఆర్ధిక నగరంలో ఉంటాయి
• స్పీడ్ ఆఫ్ బిజినెస్ ను టెస్ట్ చేయాలంటే ఏపీకి రండి… మీ పెట్టుబడులు ఏపీలో సురక్షితం.








