Yellamma: వేణు బలగం టీమ్ ను రిపీట్ చేస్తాడా?
అప్పటివరకు కమెడియన్ గా ఎన్నో సినిమాలు, జబర్దస్త్(jabardasth) లాంటి రియాలిటీ షోలు చేసిన వేణు యెల్దండి(Venu Yeldandi) బలగం(Balagam) సినిమాతో డైరెక్టర్ గా మారి అందరికీ ఒక్కసారిగా షాకిచ్చాడు. వేణు డైరెక్టర్ అవడమే అందరికీ షాకింగ్ గా ఉంటే ఆ సినిమాతో హిట్ కొట్టి ఆశ్చర్యపరిచాడు. మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకున్న వేణు రెండో సినిమాను దిల్ రాజు(Dil Raju) బ్యానర్ లో చేయనున్నాడనే విషయం తెలిసిందే.
వేణు రెండో సినిమాగా ఎల్లమ్మ తీయబోతున్నాడని దిల్ రాజు ఆల్రెడీ అనౌన్స్ చేశాడు. వాస్తవానికైతే ఈ సినిమా ఎప్పుడో మొదలవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల లేటవుతూ వచ్చింది. ఎల్లమ్మ(Yellamma)లో నితిన్(Nithin) హీరోగా నటించబోతున్నానే సంగతి తెలిసిందే. తమ్ముడు(thammudu) సినిమా రిలీజయ్యాక ఎల్లమ్మను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు నితిన్.
ఇదిలా ఉంటే ఎల్లమ్మకు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట వినిపిస్తోంది. ప్రస్తుతం వేణు ఎల్లమ్మ మూవీ కోసం మైసూరులో లొకేషన్స్ ను వెతుకుతున్నాడని సమాచారం. అంతేకాదు, బలగం సినిమాటోగ్రాఫర్ ఆచార్య వేణు(Acharya Venu)ను ఎల్లమ్మ కోసం వేణు రిపీట్ చేస్తున్నాడని తెలుస్తోంది. పీరియడ్ డ్రామగా తెరకెక్కనున్న ఎల్లమ్మలో తెలంగాణ ఆచారాల గురించి చెప్పబోతున్నాడట వేణు. మే లేదా జూన్ లో ఎల్లమ్మ సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.













