TTD: టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యతల స్వీకరణ
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణాధికారి (ఈవో)గా ముద్దాడ రవిచంద్ర (Muddada Ravichandra) బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆలయ క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ఈవో దంపతులు భూవరాహస్వామివారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూకాంప్లెక్స్-1 మీదుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న వారికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి (Venkaiah Chowdary), అధికారులు స్వాగతం పలికారు. రంగనాయకుల మండపంలో టీటీటీ నూతన ఈవో(EO) గా రవిచంద్ర పదవీ బాధ్యతలు చేపట్టారు.అనంతరం టీటీడీ బోర్డు ఎక్సఅఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి, శ్రీవారి మూలమూర్తిని దర్శించుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈవో దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అదనపు ఈవో తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆలయం వెలుపల ఈవో మీడియాతో మాట్లాడారు. శ్రీవారి భక్తుడిగా ఉన్న తనకు సహచర భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగిందన్నారు. హిందువుల నమ్మకాలను నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు కతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత స్థానిక అన్నమయ్య భవనంలో, తిరుపతిలోని పరిపాలన భవనంలో పలు విభాగాధిపతులతో ఈవో సమీక్షించారు.






