మే 2న అన్నమయ్య జయంతి సందర్భంగా “విశ్వ శాంతి సంకీర్తనా యజ్ఞం”
విశ్వమంతా యుద్ధ వాతావరణం నేలకొని ఉంది. ఆ ప్రభావం భారత దేశం పైన కూడా కనబడుతోంది. గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడం, పేట్రోల్ ధరలు అధికమవడం, నిత్యావసరల ధరలు పెరిగి పోవడం మొదలైన పరిమాణాలు చూసి, “అన్నమాచార్య భావనా వాహిని” తన వంతు కర్తవ్యంగా “విశ్వ శాంతి సంకీర్తనా యజ్ఞం” తలపెట్టింది.
618వ అన్నమాచార్య జయంతిని పురస్కారించుకోని అన్నమాచార్య భావనా వాహిని మే నేల 2వ తేదీన “విశ్వ శాంతి సంకీర్తనా యజ్ఞం” నిర్వహిస్తోంది. ఈ అద్భుత కార్యక్రమం ఉదయం 7.30గంటలకు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ మీది అన్నమయ్య విగ్రహం వద్ద జరుగనుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో శ్రీశక్తి పీఠం అధినేత్రి పూజ్య శ్రీ రమ్యానంద భారతి స్వామిని వారు, తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారులు, శ్రీ కె.వి. రమణాచారి గారు, హైదరాబాద్ మీడియా హౌస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ కే. హానుమంత రావు గారు, తెలుగు టైమ్స్ ఎడిటర్, శ్రీ చెన్నురి సుబ్బారావు గారు పాల్గుంటారు.
ప్రముఖ గాయని, గాయకులుతో అన్నమాచార్య భావనా వాహిని విద్యార్థి బృందంతో సాగే “విశ్వ శాంతి సంకీర్తనా కార్యక్రమం, అల్పాహార స్ధాయిలో అందించే ప్రసాద వితరణ, అన్నమాచార్య భావనా వాహిని నిర్వహించే కార్యక్రమాల్లో విశేషాంసాలు.
ఈ సందర్భంగా డా శోభారాజు స్వర పరచిన “సకల శాంతి కరము” అన్న అన్నమాచార్య సంకీర్తనాలాపన ప్రత్యేక ఆకర్షణ.
ఇవి కూడా చదవండి
