టీటీడి బోర్డ్ సమావేశం…ముఖ్య నిర్ణయాలివే…
తిరుమలలో బుధవారంనాడు జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తుల సేవ, ధర్మ పరిరక్షణ, విద్య–వైద్య అభివృద్ధి కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నట్లు టీటీడి బోర్డ్ చైర్మన్ బీ.ఆర్ నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. తిరుమలలోని ఆళ్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణాలకు రూ.4.54 కోట్ల నిధుల మంజూరు.. శ్రీవారి ఆలయ మాడ వీధులు, రహదారులు, కూడళ్లకు 51 మంది భక్తాగ్రేసుల పేర్లు పెట్టాలని నిర్ణయించారు. గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు రూ.6 కోట్లతో పైపు లైన్లు, రూ.44.2 కోట్లతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ సంస్థల నుంచి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జీ- స్క్వేర్ సంస్థ తితిదే పేరిట రిజిస్టర్ చేసిన 19.49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి రూ.36.9 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు. ఈ సమావేశంలో టీటీడీ ఈవో శ్రీఎం రవిచంద్ర గారు, బోర్డు సభ్యులు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం గారు, సివిఎసఓ శ్రీ కే.వి. మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ముఖ్య నిర్ణయాలు ఇవే….
సర్వదర్శనం క్యూలైన్లలో అదనపు మరుగుదొడ్లు నిర్మాణం
తిరుమల రోడ్లు, సర్కిళ్లకు ఆధ్యాత్మిక పేర్లు
టీటీడీ విద్యాసంస్థలకు ఆధునిక మౌలిక వసతులు
గోగర్భం డ్యామ్ నుంచి అదనపు నీటి పైప్లైన్
పట్టు వస్త్రాలు, దుప్పట్లు కొనుగోలు ఆమోదం
వర్ధనపల్లి శివాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం
చిన్నారుల కోసం ఉచిత “అక్షర గోవిందం” కిట్
కోయంబత్తూరులో 19.43 ఎకరాల భూమి టీటీడీలో విలీనం
నవీ ముంబై ఆలయానికి అవసరమైన సిబ్బంది నియామకం
ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సహకారం
వరాహస్వామి విశ్రాంతి భవనంలో అభివృద్ధి పనులు
అలిపిరి వద్ద శాశ్వత యాగశాల నిర్మాణం
డా. శోభారాజును ఆస్థాన విద్వాన్గా నియామకం
అనంతవరం ఆలయానికి రాజగోపురం నిర్మాణం
అమరావతి వెంకటపాలెంలో మహారాజగోపురం సహా భారీ నిర్మాణాలు
తిరుమలలో అన్ని కార్యాలయాలకు ఒకే పరిపాలనా భవనం
లేపాక్షిలో కొత్త కల్యాణ మండపం
దాతల ప్రివిలేజెస్ విధి విధానాల కోసం కమిటీ ఏర్పాటు
ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఆమోదం
కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు దర్శనం & లడ్డూ కార్డు
ఉద్యోగుల హెల్త్ స్కీమ్ రీయింబర్స్మెంట్ పెంపు
అలిపిరి వద్ద బస్సుల తనిఖీ కోసం శాశ్వత షెల్టర్లు
ధూప, దీప, నైవేద్య నిధి ?5,000 నుంచి ?10,000కు పెంపు
వినికిడి లోపం గల 150 మంది చిన్నారులకు ఉచిత వినికిడి యంత్రాలు
ఇవి కూడా చదవండి
