12th May 2026

____________

- Saidulu

భావోద్వేగంగా బలమైన వ్యక్తుల ఆలోచనా విధానం ఇదే.. విజయానికి ఇదే రహస్యం!

జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ భావోద్వేగంగా బలంగా ఉండే వ్యక్తులు తమ ఆలోచనా విధానంతోనే ప్రత్యేకంగా నిలుస్తారు.

ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉన్నవారు ప్రతి సమస్యను ప్రశాంతంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే పరిస్థితిని విశ్లేషించడానికే ప్రాధాన్యం ఇస్తారు.

ఇతరుల అభిప్రాయాల వల్ల తమ విలువ తగ్గదని వారు నమ్ముతారు. విమర్శలను వ్యక్తిగతంగా తీసుకోకుండా వాటి నుంచి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు.

భావోద్వేగంగా బలమైన వ్యక్తులు గతాన్ని ఎక్కువగా మోసుకెళ్లరు. జరిగిన తప్పులను అంగీకరించి, భవిష్యత్తుపై దృష్టి పెట్టి ముందుకు సాగుతారు.

ప్రతి ఒక్కరిని సంతోషపెట్టడం తమ బాధ్యత కాదని వారు అర్థం చేసుకుంటారు. అవసరమైన చోట ‘నో’ చెప్పడానికి కూడా వెనుకాడరు.

ఒత్తిడి వచ్చినప్పుడు భయపడకుండా దాన్ని నియంత్రించడానికి మార్గాలు వెతుకుతారు. ధ్యానం, నడక, ప్రశాంతమైన ఆలోచనలు వారి జీవితంలో భాగంగా ఉంటాయి.

ఎమోషనల్‌గా స్ట్రాంగ్ ఉన్నవారు తమ భావాలను దాచిపెట్టరు. అవసరమైనప్పుడు నమ్మకమైన వారితో పంచుకుని మానసికంగా తేలికపడతారు.

ఇతరులతో పోల్చుకుని నిరుత్సాహపడడం కంటే తమ అభివృద్ధిపై దృష్టి పెడతారు. చిన్న విజయాలను కూడా గుర్తించి తమను తాము ప్రోత్సహించుకుంటారు.

జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మళ్లీ నిలబడగల శక్తినే నిజమైన భావోద్వేగ బలం అంటారు. సరైన ఆలోచన, ఆత్మవిశ్వాసం ఉంటే ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు.