జూన్ 19-20 తేదీల్లో ‘మాటా’ AI హ్యాకథాన్
MATA:మన అమెరికా తెలుగు సంఘం (MATA) తన రెండవ కన్వెన్షన్ వేడుకల్లో భాగంగా ప్రతిష్టాత్మకమైన “MATA Futuristic AI Hackathon 2026” ను నిర్వహిస్తోంది. జూన్ 19 నుండి 20 వరకు ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో జరిగే ఈ కన్వెన్షన్‌లో, AI సాంకేతికత ద్వారా సృజనాత్మకతను చాటిచెప్పేందుకు ఈ వినూత్న పోటీని ఏర్పాటు చేశారు.
పోటీ వివరాలు..
థీమ్: “నిశ్శబ్ద శక్తివంతమైన కథావిష్కరణ” – AI ఆర్ట్, విజువల్స్ మరియు సంగీతం కలయికతో భావాలను పండించాలి (లిరిక్స్ లేకుండా).
సామాజిక స్పృహ: పాఠశాలల భద్రత, మానసిక ఆరోగ్యం, రోడ్డు భద్రత వంటి అంశాలపై AI పరిష్కారాలను చూపాలి.
రిజిస్ట్రేషన్: ఆసక్తి గల వారు మే 15, 2026 లోపు https://tinyurl.com/MATA-2026-AI ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.
గడువు: రూపొందించిన వర్క్ సబ్మిట్ చేయడానికి మే 31, 2026 ఆఖరి తేదీ.
నిర్వహకులు..
ఈ హ్యాకథాన్‌ను విజయవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమించారు. దీనికి వేణు గిరి చైర్‌గా వ్యవహరిస్తుండగా, మల్లేష్ అల్లాడి, జలజ గొల్ల కో-చైర్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కమిటీ సభ్యులుగా లత దేవి మైనం, సుమంత్ పేరం, శివం దువ్వురి, త్రిశాల సిద్ధాడ, రఘు కోనుగో మరియు కల్పన దొప్పలపూడి వ్యవహరిస్తున్నారు.
మాటా ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడాల, కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గెడల, మరియు ఫౌండర్ సభ్యులు శ్రీనివాస్ గనగోని, ప్రదీప్ సామల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం భారీ స్థాయిలో జరగనుంది.
విజేతలకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలు అందజేయనున్నారు. మరిన్ని వివరాలకు MATAaiHackathon2026@gmail.com లో సంప్రదించవచ్చు.
