మరో వినూత్న ప్రయాణానికి హోంబళే నాంది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్ది(Peddi)పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తుండగా, ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను తీసుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా అమెరికా మార్కెట్లో ముందస్తు బుకింగ్స్ ద్వారానే మంచి స్పందన అందుకుంటున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో తెలుగు ప్రేక్షకుల్లో “పెద్ది”పై భారీ ఆసక్తి కనిపిస్తోందని సమాచారం.
ఇదిలా ఉంటే, ఈ సినిమాతో కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్(Hombale Films) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేజీఎఫ్(KGF), సలార్(Salaar) లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఈ సంస్థ ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. హోంబళే ఓవర్సీస్(Hombale Overseas) పేరుతో కొత్త విభాగాన్ని ప్రారంభించిన సంస్థ, అంతర్జాతీయ మార్కెట్లో తమ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఈ కొత్త ప్రయాణానికి పెద్ది సినిమాను తొలి ప్రాజెక్ట్‌గా ఎంచుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు హోంబళే సంస్థ ప్రతినిధులు కూడా పెద్ది వంటి భారీ ప్రాజెక్ట్‌తో తమ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ ప్రయాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. రామ్ చరణ్‌కు ఉన్న గ్లోబల్ మార్కెట్, సినిమాపై ఉన్న క్రేజ్ దృష్ట్యా ఓవర్సీస్లో ఈ సినిమా భారీ వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిలీజ్‌కు ముందే ఇలాంటి స్ట్రాంగ్ బిజినెస్ డెవలప్మెంట్స్ జరగడం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది.
