గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ షార్లెట్ చాప్టర్ నూతన కార్యవర్గం ప్రకటన
GTA: ప్రముఖ ప్రవాస తెలంగాణ సంస్థ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) తన షార్లెట్ (Charlotte) చాప్టర్ కోసం నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకులు , అడ్వైజరీ చైర్ విశ్వేశ్వర్ కల్వల, గ్లోబల్ చైర్మన్ ప్రవీణ్ కేసిరెడ్డి, ప్రెసిడెంట్ బాపు ఆర్ కేతిరెడ్డిల మార్గదర్శకత్వంలో ఈ నూతన కమిటీని ఎంపిక చేశారు.
షార్లెట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) ప్రధాన ప్రతినిధులు..
షార్లెట్ చాప్టర్ అధ్యక్షుడిగా (President) శ్రీకర్ నాగుల బాధ్యతలు చేపట్టారు.
ఇతర ప్రధాన సభ్యులు వీరే..
- వైస్ ప్రెసిడెంట్: ప్రదీప్ వెన్నమనేని
- జనరల్ సెక్రటరీ: భరత్ కుంభం
- జాయింట్ సెక్రటరీ: సాయి కిరణ్ నాయక్
- ట్రెజరర్: రాజేందర్ చీటి
- జాయింట్ ట్రెజరర్: శ్రీనివాస్ మడ్లపల్లి
సాంస్కృతిక విభాగం చైర్‌గా ప్రియాంక కోడటి, మీడియా విభాగం చైర్‌గా మౌనిక కొక్కిరాల, మార్కెటింగ్ విభాగం చైర్‌గా రవీందర్ కొనకటి, స్పోర్ట్స్ విభాగం చైర్‌గా శ్రీనాధ గద్దెతో పాటు మరికొందరు సభ్యులు వివిధ కమిటీలకు నాయకత్వం వహించనున్నారు.
సంస్థ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వంశీ కేసిరెడ్డి, నర్సింగ్ పద్మ, రాజ్ పందిరిలతో కూడిన షార్లెట్ అడ్వైజరీ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. షార్లెట్ పరిసర ప్రాంతాల్లోని తెలంగాణ సమాజాన్ని ఏకం చేస్తూ, సేవా కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.
