జూన్ 19-20 తేదీల్లో ‘మాటా’ 2వ కన్వెన్షన్
MATA: మన అమెరికా తెలుగు సంఘం (MATA) ఆధ్వర్యంలో జూన్ 19 నుండి 20, 2026 వరకు పెన్సిల్వేనియాలోని ది గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్పో సెంటర్లో మాటా 2వ కన్వెన్షన్ ఘనంగా జరగనుంది. ఈ వేడుకలో తమ వ్యాపారాలను ప్రదర్శించుకోవడానికి వెండర్ బూత్ , సోవనీర్ ప్రకటనల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.
వివరాలు..
వెండర్ ప్యాకేజీలు: జ్యువెలరీ, రియల్ ఎస్టేట్, కార్పొరేట్ సర్వీసెస్, ఫుడ్ , ఇతర వ్యాపారాల కోసం వివిధ ధరల్లో 10X10 సైజు బూత్‌లు అందుబాటులో ఉన్నాయి.
సోవనీర్ ప్రకటనలు: వెబ్సైట్లో డిజిటల్ యాడ్స్, సోవనీర్ మ్యాగజైన్లో ఫుల్ పేజీ, హాఫ్ పేజీ , పావు పేజీ ప్రకటనలకు అవకాశం ఉంది.
నిర్వహకులు..
ఎగ్జిబిట్స్ & వెండర్ బూత్ కమిటీ చైర్‌గా నవీన్ ఎర్ర, కో-చైర్లుగా పవన్ వంగల, రాజా గంధే వ్యవహరిస్తున్నారు. వీరికి అడ్వైజర్లుగా కల్యాణ్ అచంట, దాము గెడల, శేఖర్ రెడ్డి కోనాల సహకారం అందిస్తున్నారు. మాటా ప్రెసిడెంట్ రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడాల, కో-కన్వీనర్లు టోనీ జన్ను, దాము గెడల పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఆసక్తి గల వారు https://tinyurl.com/mata-vendorexhibits లింక్ ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవచ్చు. బూత్‌లు పరిమితంగా ఉన్నందున త్వరపడాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మరిన్ని వివరాల కోసం +1 (848) 248-9189 నంబర్‌ను లేదా conventionbiz@mata-us.org ఇమెయిల్‌ను సంప్రదించవచ్చు.
