తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ USA నూతన కార్యవర్గం ప్రకటన..అధ్యక్షుడిగా డా. భరత్ నరవెట్ల
TDF: అమెరికాలోని ప్రముఖ ప్రవాస తెలంగాణ సంస్థ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) USA నూతన అధ్యాయాన్ని ప్రారంభించింది. సంస్థ ప్రెసిడెంట్ డా. భరత్ నరవెట్ల నేతృత్వంలో 2026 సంవత్సరానికి సంబంధించిన నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీల వివరాలను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్గా డా. దివేష్ అనిరెడ్డి బాధ్యతలు చేపట్టారు.
TDF USA నూతన కార్యవర్గ సభ్యులు..
- ప్రెసిడెంట్ ఎలక్ట్: ప్రీతి జొన్నలగడ్డ
- వైస్ ప్రెసిడెంట్స్: అర్చన నమిలకొండ, శ్రీనివాస్ రణబోతు, స్వాతి సుదిని
- సెక్రటరీ: శ్రీనివాస్ గిల్లేపల్లి
- జాయింట్ సెక్రటరీ: రాజేందర్ లంబు
- ట్రెజరర్: విజేందర్ దుంబాల
- జాయింట్ ట్రెజరర్: అవినాష్ కల్యాంకర్
- పాస్ట్ ప్రెసిడెంట్: శ్రీనివాస్ మణికొండ
వీరితో పాటు అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 14 మంది సభ్యులతో కూడిన బోర్డ్ ఆఫ్ ట్రస్టీలను కూడా సంస్థ పరిచయం చేసింది.
అధ్యక్షుడి సందేశం..
నూతన బాధ్యతలు చేపట్టిన సహచరులకు ప్రెసిడెంట్ డా. భరత్ నరవెట్ల శుభాకాంక్షలు తెలిపారు. కార్యవర్గ సభ్యులందరి అంకితభావం, నూతన నాయకత్వ పటిమతో తెలంగాణ సమాజంపై మరింత సానుకూల ప్రభావం చూపే దిశగా సంస్థను ముందుకు తీసుకెళ్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతిని కాపాడుతూ, సేవా కార్యక్రమాల్లో సరికొత్త ఆవిష్కరణలకు ఈ వేదిక వేదిక కానుందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
