క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్స్ ‘M4M’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.25/5
నిర్మాణ సంస్థ : మోహన్ మీడియా క్రియేషన్స్,
నటీనటులు: జో శర్మ, సంబీత్ ఆచార్య,శుభలేఖ సుధాకర్, MRC వడ్లపట్ల, పసునూరి శ్రీనివాస్,
రాజేష్ మాత్రే, సత్య కృష్ణ, గీతా భాస్కర్ తదితరులు నటించారు
సంగీతం: వసంత్ ఇసైపెట్టై, సినిమాటోగ్రఫీ: సంతోష్ షణ్మోని
ఎడిటర్ : ఆనంద్ పవన్, స్టంట్స్: యాక్షన్ మల్లి,
కథ : మోహన్ వడ్లపట్ల, రాహుల్ అడబాల,
మాటలు :మోహన్ వడ్లపట్ల, శ్రీ చక్ర మల్లికార్జున,
సహకారం: McWin Group, USA,
నిర్మాతలు :మోహన్ వడ్లపట్ల,జో శర్మ,
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : మోహన్ వడ్లపట్ల
విడుదల తేది : 08.05.2026
నిడివి : 1 ఘంట 37 నిముషాలు
హైదరాబాద్‌లో పుట్టి మహారాష్ట్రలో పెరిగి అమెరికాలో స్థిరపడ్డ జో శర్మ (Jo Sharma) హీరోయిన్గా.. టాలీవుడ్లో ‘మల్లెపూవు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ వంటి సినిమాలను నిర్మించిన టాలీవుడ్ లో ప్రముఖుడిగా వెలుగొందుతున్న నిర్మాత మోహన్ వడ్లపట్ల (Mohan Vadlapatla) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘M4M’ (మోటివ్ ఫర్ మర్డర్) మూవీ ఈ రోజు థియేటర్ లలో విడుదలైంది. ఇండియన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీ ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ఇంకా విడుదల కాకముందే 15 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు అందుకున్న ఈ చిత్రం సినీ మీడియా కి ఒక రోజు ముందుగా ప్రీమియర్ వేసారు. మరి ఇన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు అందుకున్న ఈ చిత్రం ఈ రోజు థియేటర్ లలో ప్రేక్షకుడిని ఏ మేరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.
ఇవి కూడా చదవండి
కథ :
ఎ.సి.పి. కృష్ణ (సంబీత్ ఆచార్య), క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ రాధ (జో శర్మ) భార్యాభర్తలు. సినిమా ఓపెనింగ్ హైదరాబాద్‌లో ఓ స్టార్ హీరో హత్య జరుగుతుంది. శవాన్ని హంతకుడు జీన్ సైమన్ వేసిన ‘డెత్ ఆఫ్ గ్లాడియేటర్’ పెయింటింగ్ పొజిషన్లో పెట్టి వెళిపోతాడు. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసే పనిని ఏసీపీ కృష్ణకు ప్రభుత్వం అప్పగిస్తుంది. అతని పరిశోధనలో హత్య చేసి చరిత్రలో పేరున్న పెయింటర్స్ వేసిన చిత్రాల పొజిషన్లో పెట్టి అలాంటి హత్యలు గడిచిన ఐదు సంవత్సరాలలో ఇరవై వరకూ జరిగాయని తేలుతుంది. హంతకుడు తను చేసే హత్యలు సొసైటీ లో పేరున్న మంచి ప్రాచుర్యం పొందిన వ్యక్తులను టార్గెట్ చేస్తుంటాడు పైగా…. హత్య చేసేముందు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఓ చిన్న అట్ట పెట్టిలో కాగితం పై రాసి ఈ రోజు ఎవరిని చంపబోతున్నాను అని తెలియచేస్తుంటాడు. అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వం చే రద్దు చేసిన పుస్తకం, ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ వాసుదేవ్ (ఎం.ఆర్.సి. వడ్లపట్ల) ‘M4M’ రాసిన పుస్తకం ఆదారంగా ఈ హత్యలు ఉంటుంటాయి. భార్య జర్నలిస్ట్ రాధ సహాయంతో ఎ.సి.పి. కృష్ణ సీరియల్ కిల్లర్ అయిన సైకోను ఎలా పట్టుకున్నాడు? ‘M4M’ అనే పుస్తకం లో దాగి వున్నా రహస్యాలు ఏమిటి? ఈ హత్యల వెనుక హంతకుడి మోటివ్ ఏమిటి? అతనికి ఎవరు సహకరించారు? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!
నటీ నటుల హవబవాలు :
లీడ్ క్యారెక్టర్ చేసిన జో శర్మకు ఇది తొలి చిత్రం. అయినా ఎక్కడా తడబడకుండా ఎంతో అనుభవం ఉన్న నటిలానే తన పాత్రను పోషించింది. ఆమె ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కూడా. అలానే హీరో సంబీత్ ఆచార్యకూ ఇదే మొదటి సినిమా పోలీస్ ఆఫీసర్ లా తన పాత్రకు న్యాయం చేసారు. ఇతర ప్రధాన పాత్రలలో నటించిన శుభలేఖ సుధాకర్, ఎంఆర్సి వడ్లపట్ల, రాజేష్ మాత్రే, సత్య కృష్ణ, గీతా భాస్కర్ తమ పాత్రలకు మేర నటించారు.
సాంకేతిక వర్గం పనితీరు :
సంతోష్ షణ్మోని సినిమాటోగ్రఫీ, ఎడిటర్ ఆనంద్ పవన్ వర్క్ అధ్బుతంగా వుంది. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ కి నేపథ్య సంగీతం ప్రదానం ఈ విషయం లో వసంత్ ఇసైపెట్టై బాక్గ్రౌండ్ స్కోర్ మరియు పాటలతో అదరగొట్టాడు. గతంలో ‘మల్లెపువ్వు, మెంటల్ కృష్ణ, కలవరమాయే మదిలో’ సినిమాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల ఈ సినిమాతో దర్శకుడయ్యాడు. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా ఒక్క జర్క్ గాని, లాగ్ గాని లేకుండా జాగ్రత్త పడి ఆద్యంతం సీటుకు అతుకునేలా తన మొదటి ప్రయత్నం పలించిందని చెప్పొచు. కాకపోతే ఈ తరహా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ ఓటీటీలో బోలెడన్ని అందుబాటులో వున్నా…. హంతకుడు శవాలను పెయింటింగ్ పొజిషన్ పెట్టి వెళ్ళడం అనేది కొత్తగా వుంది. అయితే పరిమితమైన బడ్జెట్లో సినిమా తీసిన మోహన్ మీడియా క్రియేషన్స్ నిర్మాణపు విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
సీరియల్ కిల్లింగ్స్, వాటిని పోలీసు అధికారులు ఛేదించడం మీద చాలానే సినిమాలు, వెబ్ సీరిస్‌లు ఎన్నో వచ్చాయి. M4M (మోటో ఫర్ మర్డర్) అనే పుస్తకాన్ని రచయిత, జర్నలిస్ట్ వాసుదేవ్ రాస్తాడు. ఆ పుస్తకాన్ని కోర్టు బ్యాన్ చేస్తుంది. ఐదు సంవత్సరాల తర్వాత ఆ పుస్తకంలో రాసినట్టుగానే ఈ హత్యలు జరుగుతాయి. దాంతో ఆ పుస్తక రచయతను కలిసి రాధ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. హంతకుడి నుండి తప్పించుకుని గతాన్ని కోల్పోయిన ఫాల్గుణ అనే దర్శకుడిని కలిసిన తర్వాత ఆమెకు ఓ క్లూ దొరుకుతుంది. అక్కడ నుండి కథ రకరకాల మలుపులు తిరిగి హంతకుడ్ని పట్టుకోవడంతో ముగుస్తుంది. కాకపోతే హంతకుడు శవాలను పాపులర్ పెయింటింగ్స్ తరహాలో పెట్టడం, దాన్ని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది కొత్తగా ఉంది. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకూ ఎక్కడా బోర్ కొట్టదు. పైగా తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కొనసాగుతూ ఉంటుంది. మర్డర్ ఇన్వెస్టిగేటివ్ డ్రామాలను ఇష్టపడేవారికి నచ్చే ఆస్కారం ఉంది. ఓటిటి లో కోకొల్లలుగా వున్నా ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్స్, క్రైమ్ డ్రామా కోసం జనాలు పని కట్టుకుని థియేటర్‌కు ఎంతవరకూ వెళతారనేది చూడాలి.
ఇవి కూడా చదవండి
