మే 16న విల్మింగ్టన్లో ‘ఆటా’ వివాహ పరిచయ వేదిక
ATA: అమెరికా తెలుగు సంఘం (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 19వ ఆటా మహాసభలు , యూత్ కన్వెన్షన్ (19th ATA Conference & Youth Convention) సన్నాహకాల్లో భాగంగా విల్మింగ్టన్లో ‘వివాహ పరిచయ వేదిక’ (Matrimony Meet & Greet) కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమ వివరాలు..
- తేదీ: మే 16, 2026 (శనివారం).
- సమయం: ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.
- వేదిక: డబుల్ట్రీ బై హిల్టన్ (DoubleTree by Hilton), 4727 Concord Pike, Wilmington, DE 19803.
రిజిస్ట్రేషన్ వివరాలు..
ఈ పరిచయ వేదిక ద్వారా పెళ్ళి సంబంధాల కోసం వెతుకుతున్న తెలుగు వారికి ఒక మంచి వేదికను కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారు ఆటా అధికారిక వెబ్సైట్ ద్వారా లేదా పోస్టర్లోని క్యూఆర్ (QR) కోడ్ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
నిర్వహణ సభ్యులు..
ఈ కార్యక్రమాన్ని మ్యాట్రిమోనీ కమిటీ చైర్ అనిత ముత్తోజు, కో-చైర్ లక్ష్మి పురుషోత్తం, , అడ్వైజర్లు శ్రీధర్ తిరుపతి, కవితా చల్లా పర్యవేక్షిస్తున్నారు. ఆటా అధ్యక్షులు జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా , కాన్ఫరెన్స్ కోర్ కమిటీ సభ్యుల మార్గదర్శకత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరిన్ని వివరాల కోసం www.ataconference.org వెబ్సైట్ను సందర్శించవచ్చని ప్రకటనలో పేర్కొన్నారు.
